Telangana Congress: దగ్గరకు తీసుకోని బీఆర్ఎస్.. కాదన్న కాంగ్రెస్.. జలగం దారెటు?

ఖమ్మం బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవగా.. అక్కడా నిరాశే ఎదురైంది. తాను పోటీ చేయాలని భావించిన కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్.

Telangana Congress: దగ్గరకు తీసుకోని బీఆర్ఎస్.. కాదన్న కాంగ్రెస్.. జలగం దారెటు?
New Update

Jalagam Venkatrao: దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్(BRS) పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన.. ఆయనే జలగం వెంకట్రావ్. ఇప్పుడు ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవగా.. అక్కడా నిరాశే ఎదురైంది. దాంతో.. ఎన్నికల్లో ఆయన పోటీపై సందిగ్ధత నెలకొంది. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో.. జలగం వెంకట్రావ్ కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యారు.

రేపో మాపో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని కూడా టాక్ నడిచింది. అక్కడ తనకు సీటు కన్ఫామ్ అనుకున్నాడు. అయితే, కాంగ్రెస్ ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీపీఐతో జత కట్టింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. దీంతో జలగం పోటీకి దారులు మూసుకుపోయాయి. ఇటు బీఆర్ఎస్ దగ్గరకు తీసుకోకపోవడం.. అటు కాంగ్రెస్‌ కాదనడంతో.. ఆయన పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన ఏకై ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్‌కు గుర్తింపు ఉంది. అయితే, 2018లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపొందారు. అయితే, ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్‌రావుపై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ ఉత్తర్వులపై వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది.

ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం టికెట్‌ను వనమా వెంకటేశ్వరరావుకే కేటాయించింది. దాంతో తీవ్ర అంసతృప్తికి గురైన జలగం వెంకట్రావ్.. కాంగ్రెస్ వైపు చూశారు. ఆ పార్టీలో చేరేందుకు ఢిల్లీకి కూడ ఆవెళ్లారు. కానీ, చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి షాక్ ఇవ్వడంతో.. ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ కాదనడంతో.. జలగం రాజకీయ భవితవ్యం ఏంటా అని నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతోంది.

Also Read:

వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

#brs #telangana-elections #congress-party #telangana-politics #khammam-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe