Kotabommali PS: హమ్మయ్య.. హీరోగా మళ్ళీ ఒక హిట్ పడింది..చాన్నాళ్ల తర్వాత శ్రీకాంత్ కొట్టాడు!

శ్రీకాంత్ హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్. కానీ చాలా సంవత్సరాలుగా శ్రీకాంత్ హీరో అనే విషయమే ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కోటబొమ్మాళి పీఎస్ సినిమా శ్రీకాంత్ కు మళ్ళీ హీరోగా ఎలివేషన్ ఇచ్చే మంచి సినిమాగా వచ్చింది. 

Kotabommali PS: హమ్మయ్య.. హీరోగా మళ్ళీ ఒక హిట్ పడింది..చాన్నాళ్ల తర్వాత శ్రీకాంత్ కొట్టాడు!
New Update

Kotabommali PS: శ్రీకాంత్.. విలన్ గా కెరీర్ స్టార్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని.. హీరోగా ఎదిగిన నటుడు. హీరోగా మంచి సినిమాలు చేసిన శ్రీకాంత్ తరువాత కొద్దిగా వెనుకబడి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ.. అవకాశాలు వచ్చినపుడు హీరోగానూ మెరుస్తూ కెరీర్ కంటిన్యు చేస్తూ వస్తున్నాడు. అయితే.. చాలాకాలంగా హీరోగా సరైన సక్సెస్ లేదు. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి సినిమాలు లేవు. దీంతో శ్రీకాంత్ (Srikanth) ని హీరోగా మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. మళ్ళీ శ్రీకాంత్ టాలీవుడ్ లో హీరోగా దుమ్ము దులుపుతున్నాడు.

సరైన కథ.. దర్శకుడు ఉంటే తన హీరోయిజం ఏ లెవెల్ లో ఉంటుందో చేసి చూపిస్తున్నాడు శ్రీకాంత్. మొన్ననే విడుదలైన కోటబొమ్మ్మాళి పీఎస్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తోంది. దాదాపుగా ప్రేక్షకులంతా హీరోగా శ్రీకాంత్ ని మర్చిపోతున్న తరుణంలో మళ్ళీ పూర్వ శ్రీకాంత్ ని కళ్ల ముందు నిలబెట్టింది కోటబొమ్మాళి. 

Also Read: ఓటీటీలో ఆ నలుగురు హీరోయిన్ల హవా.. ఆ సినిమాలు తెగ చూసేస్తున్నారు 

నిజానికి చెప్పాలంటే శ్రీకాంత్ ది ఇందులో పూర్తి లీడ్ రోల్ కాదు. ముగ్గురు లీడ్ రోల్స్ మధ్యలో ఒక లీడ్ రోల్ అయితే, ఈ క్యారెక్టర్ సినిమాకి చాలా కీలకం. ప్రధానంగా కథ అంతా శ్రీకాంత్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా తెలుగు నేటివిటీకి చక్కగా మార్పులు చేసుకున్నారు. మళయాళ మాతృక లో జోజు జార్జ్ చేసిన పాత్ర శ్రీకాంత్ చేశాడు.

మలయాళంలో జాజు జార్జ్ ఒక రకంగా సినిమాలో అందర్నీ డామినేట్ చేసే నటన ప్రదర్శించాడు. మన శ్రీకాంత్ ఆపాత్రకు ఎలా న్యాయం చేస్తాడనే డౌట్ చాలామందికి ఉంది. కానీ, సరైన పాత్ర దొరికితే తానూ ఎలా రెచ్చిపోగలడో నిరూపించాడు శ్రీకాంత్. ఈ పాత్ర సినిమాకే హైలైట్ అయింది. ఒకరకంగా మళయాళ సినిమాకన్నా బాగా తెలుగులోనే ఈ పాత్ర వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో క్లైమాక్స్ అద్భుతంగా వచ్చింది. అందులో శ్రీకాంత్ జీవించేశాడు. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆ పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చి సినిమాను ముగించారు. ఈ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. హై ఇంటెన్సిటీతో సాగే ఈ పాత్రకు శ్రీకాంత్ పూర్తి న్యాయం చేశాడు. పాత్రలోని సంఘర్షణను తెరపై బాగా చూపించగలిగాడు. చివర్లో ఈ పాత్ర కన్నీళ్లు పెట్టిస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా శ్రీకాంత్ అందరినీ పక్కకు నెట్టేశాడు. హీరోగా ఆయనకు చాలా ఏళ్ల తర్వాత దక్కిన మంచి పాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇది శ్రీకాంత్ కి హీరోగా మంచి కంబ్యాక్ గా చెప్పవచ్చు.

Watch this interesting Video:

#kotabommali-ps #tollywood #telugu-movie-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe