KTR: హీరోయిన్లకు కేటీఆర్‌ బెదిరింపులు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యాలు!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడన్నారు.

KTR: హీరోయిన్లకు కేటీఆర్‌ బెదిరింపులు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యాలు!
New Update

Konda Surekha On KTR About Phone Tapping: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైలుకు వెళ్లడం ఖాయామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడన్నారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశాడన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చాడే తప్ప.. రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు బయటకు రాలేదని ఆమె విమర్శించారు.

అధికారం లేకనే కేసీఆర్‌ (KCR) , కేటీఆర్‌  కొత్త డ్రామాలకు తెర తీశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే హక్కు కేసీఆర్‌ కు లేదన్నారు.
కేసీఆర్‌ పాలనలో ధనిక రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పుల పాలు చేశారని విమర్శించారు. కవిత మద్యం కేసు లో జైలులో ఉందనే విషయాన్ని వారు మరిచిపోయినట్లున్నారని కొండా ఎద్దేవా చేశారు.

Also Read: కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావు అరెస్ట్

వారి హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా వారికి ఆర్థిక సహాయం చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 5 గ్యారెంటీలను (Congress Guarantees) అమలు చేశామన్నారు. రైతులకు రాయితీలను ఎత్తేసి రైతు భీమా ఇచ్చామని తెలిపారు. ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ సంస్థలన్నింటిని అప్పులు పాలు చేశారు. బీఆర్‌ఎస్‌ కు (BRS) ఓటమి తప్పదని హెచ్చరించారు. కేసీఆర్‌ తన మానసపుత్రికగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ హయాంలోనే దెబ్బతిందని అన్నారు. నిర్మాణ లోపం వల్లే కాళేశ్వరం దెబ్బతిందని సురేఖ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పై కేటీఆర్‌ మాట తీరు మార్చుకోవాలని తెలిపారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం కావ్య ఉన్నారు.

#brs #ktr #kcr #konda-surekha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe