AP: మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా

సి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాస రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, కేబినెట్ మంత్రి హోదాతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు.

AP: మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా
New Update

Kommineni Srinivasa Rao : సి.ఆర్ మీడియా అకాడమీ(CR Media Academy) చైర్మన్ పదవికి రాజీనామా  చేయబోతున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావు(Kommineni Srinivasa Rao)  ప్రకటించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, ఈ నెల 16 వరకు ప్రభుత్వ సెలవులున్న దృష్ట్యా 17 వ తేదీనుంచి తమ రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఏపీ(AP) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) తమపై నమ్మకంతో కేబినెట్ మంత్రి హోదాతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.

సంతృప్తినిచ్చింది.. 

ఈ మేరకు 2022 నవంబర్ 10న తాను చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి.. 13 నెలల 15 రోజులు కాలంలో పూర్తిగా తమ సామర్ధ్యాన్ని వినియోగించి వర్కింగ్ జర్నలిస్టు(Journalist) ల కోసం పలుకార్యక్రమాలు చేయగలగడం తమకు సంతృప్తినిచ్చిందని ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ జర్నలిస్టులు, జర్నలిజం పై అభిరుచి కలిగిన వ్యక్తుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో 'జర్నలిజం లో డిప్లమో' కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో పూర్తి చేయడం తమకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయంగా తెలిపారు. అదేవిధంగా డిప్లమా కోర్సుతో పాటుగా, ప్రతి శనివారం వర్కింగ్ జర్నలిస్టులకోసం సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాల పై ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : Crime : లాడ్జికి వెళ్లిన దంపతులపై దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్

మిత్రులందరికీ కృతజ్ఞతలు..

అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని చెప్పారు. అనంతపురం(Anantapur) నుంచి ఉద్దానం (శ్రీకాకుళం జిల్లా) వరకు జరిపిన పర్యటనల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజెక్టుల అభివృద్ధిని, ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం వంటి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి ప్రజలకు మీడియా ద్వారా వివరించగలిగామని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాను కూడా సమాచార చేరవేతలో భాగస్వామిని చేయగలిగామన్నారు. తమ పదవీ కాలంలో సహకరించిన మీడియా మిత్రులందరికీ, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

#kommineni-srinivasa-rao #cr-media-academy-chairman #anantapur #andhra-pradesh-cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe