Telangana: కేసీఆర్ కాంగ్రెస్ మెనిఫెస్టోను కాపీ కొట్టారు.. కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని.. అందుకోసమే సోనియా గాంధీ తమతో చర్చించిన తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రకటించాలని సూచించినట్లు తెలిపారు. ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కూలీలను పట్టించుకోలేదని.. కానీ తమ మెనిఫెస్టోలో రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ప్రకటించామని అన్నారు. By B Aravind 19 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యాటనకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొత్త ఊపు వచ్చిందని పార్టీ నాయకులు, శ్రేణలు అంటున్నారు. నిన్న ములుగు జిల్లాలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం.. రాహుల్, ప్రియాంక గాంధీలు బహిరంగ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. తాము ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పార్టీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తామని.. గిరిజనులకు భూ హక్కులు కల్పిస్తాంటూ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాహుల్, ప్రియాంక గాంధీల పర్యటనపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని.. అందుకోసమే సోనియా గాంధీ తమతో చర్చించిన తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రకటించాలని సూచించినట్లు తెలిపారు. ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కూలీలను పట్టించుకోలేదని.. కానీ తమ మెనిఫెస్టోలో రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ప్రకటించామని అన్నారు. కేసీఆర్ తమ మెనిఫెస్టోను కాపీ కొట్టాడని.. దీంతో తమ పార్టీ గ్రాఫ్ పెరిగిపోయిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని దివాళా తీశారంటూ విమర్శించారు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి. #telangana-news #congress #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి