Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే!

మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్‌కు తమ బుల్లెట్ బలంగా దిగిందని, ఆయన రాజకీయాలను వదులుకోవడం బెస్ట్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదన్నారు.

New Update
Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే!

Telangna: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతే అన్నారు. సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అగౌరవించనట్టేనన్నారు. 83 ఏండ్ల ఖర్గే, సోనియా ఆరోగ్యం బాగాలేకపోయినా పార్లమెంటుకు హాజరవుతున్నప్పుడు కేసీఆర్ కు ఏమైందని ప్రశ్నించారు.

బుల్లెట్ దిగిందా లేదా..
ఈ మేరకు కేసీఆర్ సభకు ఎందుకు హాజరవ్వడం లేదు. సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లుగానే భావించాల్సివస్తుంది. కాంగ్రెస్ 2వసారి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్ళాం. అధికారంలోకి వచ్చాం. కానీ హరీష్ రావు, కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదు. సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్, హరీష్ ఎన్నికల్లో రేవంత్ ను ఎందుకు ఓడించలేదన్నారు. అలాగే 'ఎప్పుడొస్తే ఏంటీ బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా లేదా రాష్ట్రంలో' అన్నారు. అలాగే తాము దింపిన బుల్లెట్ కేసీఆర్ కు బలంగా దిగిందని, సీఎం సీటు పోయిన కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందుకే బండ్ల కృష్ణ మోహన రెడ్డి వెళ్ళాడన్నారు. త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని జోష్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: Wayanad landslides: వయనాడ్‌ అతలాకుతలం.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య!

ఇక కేసీఆర్ ఛాంబర్ కు వెల్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లు కాదన్నారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడిండు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా? బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు. ఆయన ఎక్కడికి వెల్లడు. జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఫారెన్ వెల్తే నేను ఉన్నగా చూసుకోవడానికి. బీఆర్ఎస్ కు నేను చాలు. త్వరలో ప్రధానిని కలుస్తా. రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తాం. ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్ కు త్వరలోనే రీ టెండర్ నిర్వహిస్తాం. వర్షాకాలంలో ప్రయానికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతామన్నారు.

Advertisment
తాజా కథనాలు