Telangana Elections:పోలింగ్ రోజున కావాలనే తెలంగాణ సెంటిమెంట్ ను లేవదీస్తున్నారు-కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు సాగర్ డ్యామ్ దగ్గర గొడవ అయ్యిందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కావాలనే పోలింగ్ రోజున తెలంగాణ సెంటిమెంట్‌ను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.

New Update
Telangana Elections:పోలింగ్ రోజున కావాలనే తెలంగాణ సెంటిమెంట్ ను లేవదీస్తున్నారు-కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పోలింగ్ డే రోజున తెలంగాణ సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నాగార్జునా సఆగర్ దగ్గర అందుకే గొడవ చేయిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతుందనే భయంతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు దీనిని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజానిజాలు తెలుసుకుని ఓటు వేయాలని...కాంగ్రెస్ ను గెలిపించాలని కోమటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ చెప్పినట్టు ఆరు పథకాలు తప్పక అమలు చేస్తామని ఆయన మామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.

Also read:పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.75 లక్షల ఓట్లు నమోదు

నాగార్జునా సాగర్ దగ్గర అరధరాత్రి గందరగోళం ఏర్పాడింది. నాగార్జున సాగర్ డ్యామ్ పై జలవనరుల శాఖ పరిధి వరకూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వమే పర్యవేక్షించింది. అప్పుడుకూడా సాగర్ డ్యామ్ పై ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు అనుమతించలేదు. అదే ఇప్పుడు కూడా కొనసాగించడంతో గొడవ మొదలైంది. దీంతో ఏపీ పోలీసులకు, తెలంగాణ పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సాగర్ ప్రాజెక్టు ఎంట్రన్స్ వద్ద సీసీ కెమేరాలు, డ్యాం గేట్లను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే ఇంత జరుగుతున్నా ఏపీ వైపు డ్యాం దగ్గర తెలంగాణ ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే సిబ్బంది మాత్రం కనిపించలేదు. దీంతో సాగర్ డ్యాం వద్ద భారీగా ఏపీ పోలీసులు వచ్చి చేరారు. ఇంకోవైపు తెలంగాణ వైపు గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Also Read:ఓటు వేయకపోతే శిక్షలు పడతాయి…ఎక్కడో తెలుసా?

Advertisment
తాజా కథనాలు