GOAT Movie: విజయ్ 'GOAT' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వైరలవుతున్న పోస్టర్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబ‌ర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.

New Update
GOAT Movie: విజయ్ 'GOAT' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వైరలవుతున్న పోస్టర్

GOAT Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. భారీ అంచనాలతో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Also Read: Krishnamma: ‘కృష్ణమ్మ’ నుంచి దుర్గమ్మ సాంగ్.. దుమ్మురేపిన సత్యదేవ్

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ రిలీజ్ డేట్

రంజాన్ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ వచ్చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ శంకర్ రాజా నిర్మిస్తున్నారు.

రష్యాలో షూటింగ్

ఈ మూవీలో విజయ్ సరసన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించగా.. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చెన్నై, థాయ్‌లాండ్, హైదరాబాద్, శ్రీలంక, పాండిచ్చేరి, తిరువనంతపురం ఇలా పలు ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ మూవీ.. ప్రస్తుతం రష్యాలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ విజయ్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు సమాచారం.

Also Read: Hero Ram Charan: గ్లోబల్ స్టార్ కు అరుదైన గౌరవం.. గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ

Advertisment
తాజా కథనాలు