Bigg Boss : బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి..

బిగ్‌ బాస్‌ తమిళ్‌ లేటెస్ట్ సీజన్‌ ను విజయ్ సేతుపతి హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై పలు షోలను హోస్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు బిగ్‌ బాస్‌ వేదికపై కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Bigg Boss : బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి..

Kollywood Actor Vijay Sethupathi : కోలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. గత కొన్ని సీజన్స్ ను హోస్ట్ చేసిన కమల్ హాసన్ లేటెస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా కమిట్‌మెంట్స్‌ కారణంగా బిగ్‌ బాస్‌ తమిళ్‌ అప్‌కమింగ్‌ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నట్టు కమల్ తెలిపారు.

ఇప్పటివరకు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోకు తర్వాతి హోస్ట్ ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న న్యూస్ ప్రకారం.. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ షోను హోస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ షోకు సంబంధించిన టీజర్‌ను కూడా సిద్ధం చేశారని టాక్‌ వినిపిస్తుంది.

Also Read : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘ఇంద్ర’ రీ రిలీజ్ వాయిదా?

విజయ్‌ సేతుపతి ఓవైపు నటనతో పాటు వ్యాఖ్యాతగానూ అలరిస్తున్నారు. ఇప్పటికే సన్‌ టీవీలో ప్రసారమవుతున్న ‘మాస్టర్‌ చెఫ్‌’తో పాటు మరో కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ వేదికపై కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీజర్ తో ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.

Advertisment
తాజా కథనాలు