Crime News : సహజీవనంలో చిచ్చు.. ప్రియుడిని కడతేర్చిన లవర్‌!

లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన మరో హత్య వెలుగుచూసింది. కోల్‌కతాలో ఓ మహిళ తన్‌ లివ్‌ఇన్‌ పార్టనెర్‌ను కత్తితో పొడిచి చంపింది. ఇద్దరు చాలా కాలంగా లివ్‌ ఇన్‌లో ఉన్నారు. ఇటివలే ఆమెను లైఫ్‌పార్టనెర్‌గా అతను ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌కు పరిచయం చేశాడు. ఇది జరిగిన 10 రోజులకే హత్య జరిగింది.

New Update
Crime News : సహజీవనంలో చిచ్చు.. ప్రియుడిని కడతేర్చిన లవర్‌!

Live in Relationship Murder : ఈ మధ్య కాలంలో లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌(Live In Relationship) ట్రేండ్‌గా మారింది. ముఖ్యంగా పట్టణాల్లో ఈ కల్చర్‌ పెరిగింది. దీని చుట్టూ హత్యలు(Suicide) కూడా పెరుగుతున్నాయి. నిజానికి భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం లాంటి ఘటనలు అనేకం ఉంటాయి. అదే విధంగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ మర్డర్లు కూడా ఇదే తరహాలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోల్‌కతా(Kolkata) లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన లివ్ ఇన్ పార్టనర్‌ను కత్తితో పొడిచి చంపేసింది. తర్వాత స్వయంగా ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు మహిళ అపార్ట్ మెంట్‌కు చేరుకున్నారు. ఘటనాస్థలిని చూసి షాక్‌ అయ్యారు. ఎందుకంటే మొత్తం రక్తమే కనిపించింది. సార్థక్ దాస్ అనే వ్యక్తి శరీరంపై అనేక కత్తి గుర్తులతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. సార్థక్‌ చనిపోయి చాలా సేపు అయ్యిందని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం మహిళను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది?
మహిళ పేరు సంహతి పాల్(Samhathi Pal). మృతుడి పేరు సార్థక్ దాస్(Sardhak Das). 32 ఏళ్ల సార్థక్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్(Photographer). 30 ఏళ్ల సంహతి మేకప్ ఆర్టిస్ట్. కొన్ని రోజులుగా ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సంహతి పదునైన కత్తితో సార్థక్‌ను పొడిచింది. సార్థక్ శరీరంపై చాలా గాయాల గుర్తులు ఉన్నాయి. విచారణలో సంహతి పాల్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అంతా బాగానే ఉంది కదా?
సార్థక్‌ ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌(Facebook Timeline) లో సంహతితో కలిసి ఉన్న చాలా ఫొటోలు ఉన్నాయి. కవర్‌ పిక్‌ కూడా ఆమెతో కలిసి ఉన్నదే పెట్టుకునేవాడు. అయితే మూడు రోజుల క్రితం అతను తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ఇక అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఫిబ్రవరి 20, 22 తేదీలలో, సార్థక్ తన DPని మార్చాడు. అందులో సంహతిని లైఫ్‌లైన్‌గా పేర్కొన్నాడు. ఈ పోస్టుకు ప్రేమ ఎమోజీని జోడించాడు. అయితే సంహతి టైమ్‌లైన్‌లో మాత్రం ఫొటోలు కనిపించలేదు.

Also Read : రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. బాంబు పెట్టిన వ్యక్తి అరెస్ట్?

Advertisment
తాజా కథనాలు