Kolkata Trainee Doctor Case: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విచారణను హైకోర్టు (High Court) సీబీఐకి (CBI) అప్పగించింది. మూడు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు సంజయ్ ని (Sanjay) ఉరి తీయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 18 లోగా పోలీసులు కేసును చేధించలేకపోతే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతా పోలీసులకు ఇటీవలే వార్నింగ్ ఇచ్చారు. అయితే అమె చెప్పినదానికంటే ఐదు రోజులు ముందుగానే హైకోర్టు సీబీఐకీ అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రైవేట్ పార్ట్ పై క్రూరంగా దాడి..
ఈ హత్యాచారం కేసులో సంచలనం నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ మొదట ఆమెను హత్య చేసి ఆ తర్వాత రేప్ చేసినట్లు పోలీసులు నిర్దారించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె పెదవులు, కళ్లు, గోళ్లు, మెడ, కడుపు, నాభి, నోరు, కుడి చేయి, ఎడమ కాలుపై తీవ్రమైన గాయాలుండటంతోపాటు రక్తస్రావం అయినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్ పట్ల ఆ దుర్మార్గుడు క్రూరంగా ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మర్మాంగంనుంచి కూడా చాలా రక్తం కారినట్లు తెలిపారు. ఈ ఆధారాలతోనే ముందుగా యువతిని చంపి, ఆ తర్వాత అత్యాచారం చేసినట్లు అంచనా వేశామని పోలీసులు చెబుతున్నారు.