Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్

కోలకత్తాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీని వెనుక డ్రగ్స్ మాఫియా కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది.

New Update
Kolkata:  ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్

Polygraph Test:దేశంలో ప్రస్తుతం మారుమోగుతున్న విషయం జూనియర్ డాక్టర్ హత్యోదంతం. రేప్‌తో స్టార్ అయిన ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ధర్నాలు, ఆందోళనలతో దేశం అట్టుడికిపోతోంది ఒకవైపు. మరోవైపు సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి చూశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయం కావాలి అంటూ నిరసన చేశారు. దీంతో ఈ వ్యవహారం చాలా సీరియస్ అయిపోయింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్య చేశాడంటూ అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కోలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఈనెల 20న అంటే రేపు సీబీఐ అధికారులు సంజయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు.

ఇక కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ పోస్టుమార్టం రిపోర్టులో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు బలంగా గొంతు నొక్కడం వల్లే అభయ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయాయి. తల, బుగ్గలు, ముక్కు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ మోకాలు, చీలమండ, జననేంద్రియాలతో పాటు వివిధ శరీరభాగాలపై మొత్త 14 గాయాలున్నట్లు రిపోర్టులో వైద్యులు ప్రస్తావించారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారించారు.

Also Read: Mamata: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా? అభయ కేసులో నిరసనలు!

Advertisment
తాజా కథనాలు