Kolkata case: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ పోస్టుమార్టం రిపోర్టులో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు బలంగా గొంతు నొక్కడం వల్లే అభయ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు అభయపై లైంగిక దాడి జరిగింది నిజమేనని చెప్పిన వైద్యులు బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం అనేది తప్పుడు ప్రచారమన్నారు. కానీ ఆమె ప్రైవేట్ పార్ట్ లో తెల్లటి ద్రవం మాత్రం ఉందని నివేదికలో వెల్లడించారు.
జననేంద్రియాల బరువు 151 గ్రాములు..
ఈ మేరకు అభయ జననేంద్రియాల బరువు 151 గ్రాములుంది. ఆమె శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయాయి. తల, బుగ్గలు, ముక్కు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ మోకాలు, చీలమండ, జననేంద్రియాలతో పాటు వివిధ శరీరభాగాలపై మొత్త 14 గాయాలున్నట్లు రిపోర్టులో వైద్యులు ప్రస్తావించారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Madhuri: దువ్వాడ ఆలనా పాలనా నాదే.. మాధురి మరో సంచలన వీడియో!
మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నాయి. నిందితుడు సంజయ్‌తో పాటు ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌కు పాలిగ్రాఫ్ టెస్టు చేయించాలని కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఘటన జరిగిన మరుసటి రోజే సంజయ్ రాయ్ ను అరెస్టు చేయగా.. ప్రస్తుతం సీబీఐ పరిధిలో కేసు విచారణ జరుగుతోంది.