Revanth: నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్.. సీఎం!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్’ అని అన్నారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని 58 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

New Update
Revanth: నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్.. సీఎం!

Kodangal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొడంగల్‌లో పర్యటించిన ఆయన.. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని 58 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్’ అని అన్నారు. కాంగ్రెస్‌లో డీకే అరుణ మంత్రి పదవి అనుభవించారని, ఇప్పుడు బీజేపీలోనూ కీలక పదవిలో ఉన్న ఆమె పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదంటూ విమర్శించారు.

ఇది కూడా చదవండి: Guntur: కూటమి అధికారంలోకి వస్తేనే మా జాతికి మేలు.. మందకృష్ణ!

డీకే అరుణ వల్ల ఒరిగిందేమీ లేదు..
ఈ మేరకు మహబూబ్ నగర్ ప్రజలకు డీకే అరుణ వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్‌లో రూ.4 వేల కోట్లతో నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ఓడించాలా? అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. కొడంగల్‌లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు