Kodali Nani: 'చంద్రబాబు బీసీ భజనను ఎవరూ నమ్మరు'.. మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్

చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికి వదిలేసిన చంద్రబాబు.. ఇప్పుడు బీసీ భజన చేసినా ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Kodali Nani: చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడు.. కొడాలి నాని విమర్శనాస్త్రాలు

Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ నిర్వహిస్తున్న బీసీ సదస్సుపై కౌంటర్ వేశారు. సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికి వదిలేసిన చంద్రబాబు.. ఇప్పుడు బీసీ భజన చేసినా ఎవరూ నమ్మరని ఎద్దెవ చేశారు. ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్నీ అబద్దపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కామెంట్స్ చేశారు.

Also Read: వారికి టికెట్ వద్దు.. జగన్ కు మాజీ సీఎం కేసీఆర్ సలహాలు!

చంద్రాబాబు బీసీలకు ఏం చేశాడు?: 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక్క అని ఎలా చెప్తారు? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసి రిజర్వుడు పదవులను కూడా ఇస్తూ బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారని వ్యాఖ్యనించారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ ఇచ్చారా? అని ప్రశ్నించారు.


దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయి:

విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వాళ్లు గెలుస్తామని ధీమ వ్యక్తం చేస్తున్నారని..అయితే, ఎన్నికల తరువాత ప్రజల తీర్పుతో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని చురకలు వేశారు. కచ్చితంగా జగన్ సీఎం అవుతారని ధీమ వ్యక్తం చేశారు. ప్రజల్లో జగన్ కు ఉన్న ఆదరణ చూసే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయని ఎద్దెవ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడని విమర్శలు గుప్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు