Kodali Nani: చంద్రబాబు, పవన్, లోకేష్ కలిసిన జగన్ ను ఏమీ చేయలేరు.!

యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని కౌంటర్లు వేశారు.

Kodali Nani: చంద్రబాబు, పవన్, లోకేష్ కలిసిన జగన్ ను ఏమీ చేయలేరు.!
New Update

EX Minister Kodali Nani Sensational Comments: సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ముఖ్యమంత్రిగా సీఎం తన 5వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారని అయితే ప్రతి పుట్టిన రోజును పేదలకు, పిల్లలకు సహయం చేస్తూ జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ నేపధ్యంలోనే యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. పవన్, లోకేష్, చంద్రబాబు అడుగు ఉడిపోయిన బక్కెట్ గాళ్ళంత నిన్న చేసింది, పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమేనని ఆయన కౌంటర్లు వేశారు. టీడీపీ తో జనసేన పవన్ కలిసిన జగన్ వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు, పవన్.!

సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలుపెట్టారని 12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్ సోనియాను కూకటి వేళ్లతో పేకలించి.. చంద్రబాబును భూస్థాపితం చేసి, పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించి, మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వీరు ముగ్గురు ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలెట్టిన జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని ధీమ వ్యక్తం చేశారు.

Also read: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్ తప్పదా?

ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడని..అయితే, 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యాడని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా? పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా? తండ్రి, కొడుకు, పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లేనని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. బోరా గాళ్ళంత మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని తేల్చి చెప్పారు.

#ex-minister-kodali-nani #chandrababu #andhra-pradesh #jana-sena-chief-pawan-kalyan #lokesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి