Octopus : ఒక మెదడు... ఎనిమిది చేతుల వింత జీవి గురించి మీకు తెలుసా..

మన పురాణాలు, కథల్లో ఆక్టోపస్‌ను గ్రహాంతర జీవిగా చెప్పారు. తర్వాత కాదని తెలిసినా....ఇప్పటికీ దాని గురించి వింతగానే చెప్పుకుంటాము. దానికి కారణం ఆక్టోపస్ శరీరం రూపం వింతగా ఉండటమే! ఏ జీవిలో లేని ఎన్నో వింతలు, విశేషాలు దీనికి ఉన్నాయి. అవేంటో తెలుసా..

Octopus : ఒక మెదడు... ఎనిమిది చేతుల వింత జీవి గురించి మీకు తెలుసా..
New Update

Know About Octopus : అక్టోపస్(Octopus) లు వింత జీవులే కాదు, అరుదైన జాతి కూడా. ఎక్కడపడితే అక్కడ అన్నిచోట్లా ఇవి కనిపించవు. మళ్ళీ ఇందులో రెండు రకాలుంటాయి. మామూలుగా చిన్నవిగా ఉండేవి. పెద్దగా ఉండే జెయింట్ ఆక్టోపస్ లు. ఈ జెయింట్ ఆక్టోపస్ లు సహజంగా జపాన్(Japan), అమెరికా(America) పశ్చిమ తీరంలో ఉన్న అలూటియన్ దీవుల్లో జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లు ఎక్కువగా కనిపిస్తాయి.  ఈ ఆక్టోపస్‌ చుట్టూ కదులుతూ ఉండే 8 చేతులకు ఒక్కో మెదడు ఉంటుంది. కంట్రోల్‌ మూవ్‌మెంట్‌ అంతా మాత్రం మధ్యలో ఉండే ప్రధాన మెదడు(Brain) నియంత్రిస్తుంది. చేతులన్ని స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ ఒకే లక్ష్యంతో కదులుతాయని జీవశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు.

Also Read : పండుగల్లో మెరిసిపోవడం ఎలా…

ఇదే కాదు ఆక్టోపస్‌కు ఏకంగా మూడు గుండెలు(3 Hearts) ఉంటాయి. వీటిలోని రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటికంటే పెద్దగా ఉండే ప్రధాన గుండె మిగతా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌ లో కాపర్‌ అధికంగా ఉండే  హిమోసైనిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ చల్లని సముద్రం నీళ్లలో కూడా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఇస్తుంది.

ఈ ఆక్టోపస్‌లో క్రొమటోఫోర్స్‌ అనే ప్రత్యేక ద్రవ్యం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడు రంగు, ఆకారాన్ని కూడా మార్చుకోగలవు. ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్‌లను వేటాడేటప్పుడు తమని తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్మి, గందరగోళానికి గురిచేస్తాయి. ఇక ఆక్టోపస్‌ చేతులపై బొడిపెల్లాంటి పిలకలుంటాయి... గమనించారా? ఐతే ఆడ ఆక్టోపస్‌లకు ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్‌లకు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి.

అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే.... ఆడ ఆక్టోపస్‌లు సముద్రం అడుగు భాగంలో గుడ్లు పెట్టి, 7 నెలలు ఆహారం తీసుకోకుండా పొదుగుతాయి. పిల్లలు పుట్టగానే మరణిస్తాయి. అందుకే ఈ ఆక్టోపస్ ల సంతతి పెద్దగా కనిపించవు.

#eight-hands #sea-creature #octopus #3-hearts
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe