Cyber Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ ఎలానో.. సైబర్ ఇన్సూరెన్స్ అలా.. ఎందుకంటే.. 

టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోపక్క సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వారి కోసం సైబర్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా రూ. 50,000 హామీ మొత్తం నుంచి రూ. 1 కోటి వరకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.

New Update
Cyber Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ ఎలానో.. సైబర్ ఇన్సూరెన్స్ అలా.. ఎందుకంటే.. 

Cyber Insurance: రిలయన్స్ జియో భారత టెలికాం మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. దీంతో మన దేశంలో ఇంటర్నెట్ వేగంగా విస్తరించింది. ఒకపక్క అందుబాటులోకి టెక్నాలజీ వేగంగా వచ్చింది. అదెంత వేగంగా అందుబాటులోకి వచ్చిందో అంతకంటే వేగంగా ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు వాటి కొత్త సమస్యలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో  'సైబర్ ఇన్సూరెన్స్' కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సైబర్ బీమా ఉపయోగం ఏమిటి, అది  మనకు  ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? అది ఇతర బీమాల నుంచి ఎలా విభిన్నంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. 

గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాల(Cyber Insurance) సంఖ్యను పరిశీలిస్తే.. వాటి సంఖ్య లక్షల్లోనే ఉంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని రూపాయలు చెల్లించడం ద్వారా మీరు సైబర్ మోసం లేదా ఇతర మోసాల నుంచి రక్షణ పొందినట్లయితే ఇటువంటి నష్టాల పాలు కాకుండా ఉండవచ్చు.  కేవలం సైబర్ ఇన్సూరెన్స్  మనకు  అలాంటి రక్షణను అందిస్తుంది.

సైబర్ ఇన్సూరెన్స్  అంటే ఏమిటి?
సైబర్ ఇన్సూరెన్స్ లో, పాలసీదారుడు వివిధ రకాల సైబర్ మోసాల(Cyber Insurance) నుంచి రక్షణ పొందుతాడు. ఇందులో యూపీఐ ద్వారా సైబర్ మోసం, క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే మోసం, ఫిషింగ్, ఇ మెయిల్ స్పూఫింగ్ తదితరాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలు కవర్ అవుతాయి. ఇది మాత్రమే కాదు, మీ బ్యాంక్ ఎకౌంట్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లో ఉన్న డబ్బుతో అవాంఛిత లావాదేవీలు లేదా మోసం నుంచి కూడా ఈ పాలసీ మిమ్మల్ని రక్షిస్తుంది.

Also Read: నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది

మీ సెక్యూరిటీని జాగ్రత్తగా చూసుకుంటుంది
సైబర్ బీమా పాలసీలో మీ సెక్యూరిటీ (Cyber Insurance)కూడా జాగ్రత్తగా ఉంటుంది.  అంటే, డేటా లీకేజీ కారణంగా మీరు ఏదైనా నష్టపోతే మీ వ్యక్తిగత డిజిటల్ సమాచారాన్ని కూడా కంపెనీ రక్షిస్తుంది. ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు క్లెయిమ్‌లు చెల్లించడం ద్వారా అటువంటి నష్టాలను భర్తీ చేస్తారు.

ప్రస్తుతం దేశంలో చాలా కంపెనీలు సైబర్ బీమా పాలసీల(Cyber Insurance)ను అందిస్తున్నాయి. వీటిలో బజాజ్ అలయన్జ్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొదలైన వాటికి ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. వీటిలో, మీరు రూ. 50,000 హామీ మొత్తం నుంచి రూ. 1 కోటి వరకు ఇన్సూరెన్స్  తీసుకోవచ్చు.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు