Ind Vs Eng: ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ (KL RAHUL) వికెట్ కీపింగ్ చేయడం లేదని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (DRAVID) ధృవీకరించాడు. ఈ నిర్ణయం గురించి జట్టుకు స్పష్టత ఉందని, వికెట్ కీపర్-బ్యాటర్ పాత్ర కోసం ఇప్పుడు కెఎస్ భరత్, ధ్రువ్ జురెల్ ల పేర్లను పరీశీలిస్తున్నట్లు ద్రవిడ్ పేర్కొన్నాడు.
మేము స్పష్టంగా ఉన్నాం..
ఈ మేరకు 'రాహుల్ ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా ఆడటం లేదు. మేము దాని గురించి స్పష్టంగా ఉన్నాం. మేము మరో ఇద్దరు వికెట్ కీపర్‌లను ఎంచుకున్నాం. దక్షిణాఫ్రికాలో రాహుల్ మా కోసం అద్భుతంగా పనిచేసాడు. సిరీస్‌ని డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ పరిస్థితులలో ఐదు టెస్టు మ్యాచ్‌ల ఆడటం పరిగణనలోకి తీసుకుంటే.. మనకు ఉన్న మరో ఇద్దరు కీపర్ల మధ్య పోటీ నెలకోంది. ఒకరిని ఎంపిక చేస్తాం'అని ద్రవిడ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : India vs England: కోహ్లీ స్థానంలో కత్తిలాంటి కుర్రాడు.. బెస్ట్ ఫినిషర్ కే ఛాన్స్!
కీపర్-బ్యాటర్ కావాలి..
అలాగే ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో వికెట్‌కీపర్-బ్యాటర్ పాత్ర కోసం భారత్ మొగ్గు చూపే అవకాశం ఉంది. భారత్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో బ్యాటింగ్ చేసే మంచి వికెట్‌కీపర్‌ను ఎంచుకోవడం తప్పనిసరి అయింది. ఈ సందర్భంలో ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలతోపాటు ఒక స్పెషలిస్ట్ స్టంపర్‌కు కేటాయించాల్సిన అవసరం ఉందని రాహుల్ ద్రవిడ్ అన్నారు. ముఖ్యంగా స్పిన్ కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ కూడా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ప్రాముఖ్యతకే విలువనిస్తుందన్నారు. ఇక ఈ సిరీస్‌లోని తొలి టెస్టు జనవరి 25 గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.