KKR vs SRH: ఊరించి.. ఉసురుమనిపించారు.. హైదరాబాద్ కొంపముంచింది ఆత్రమే! ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్ 4 రన్స్ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. చివరి 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి విజయానికి 5 పరుగుల దూరంలో SRH నిలిచిపోయింది. కమ్మిన్స్ టీమ్ ఓటమికి కారణాలేంటి? సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Trinath 24 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL 2024: క్రికెట్‌లో మ్యాచ్ మలుపు తిరగడానికి ఒక బంతి చాలు. గెలుపు ఖాయమనుకోని ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోతే ఓటమి మూటగట్టుకోవాల్సి వస్తుంది. గెలవడం అసాధ్యమనే పొజిషన్ నుంచి ఇక గెలుపు నల్లేరుపై నడకే అనే పరిస్థితికి వచ్చే వరకు.. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక్కసారిగా ఢమాల్ అనేవరకు ఎన్నో మ్యాచ్‌లు జరుగుతుంటాయి. ఐపీఎల్ లాంటి థ్రిల్లింగ్ లీగ్‌లో ఇలాంటి మ్యాచ్‌లు పంచే మజా అంతా ఇంతా కాదు. మరోసారి అదే జరిగింది. కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మాజాను పంచింది. చివరకు నైట్ రైడర్స్ శిబిరంలో ఆనందాన్ని నింపింది.. ఇటు సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది. మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఆ ఒక్క బంతేనంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా బంతి? స్టార్క్‌ను చితక్కొట్టారు: 209 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో సన్ రైజర్స్ లాస్ట్ ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అంతకముందు స్టార్క్ వేసిన ఓవర్లలో ఏకంగా 26 పరుగులు దండుకుంది హైదరాబాద్. స్టార్క్‌పై క్లాసెన్ విరుచుకుపడ్డాడు. అటు షాబాజ్ అహ్మద్ కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. దీంతో లాస్ట్ ఓవర్‌లో 13 రన్స్ చేస్తే సరిపోయే పరిస్థితికి వచ్చిన హైదరాబాద్ గెలుపుకు చాలా దగ్గరగా వచ్చింది. హర్షిత్ రాణా వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి క్లాసెన్ సిక్సర్ కొట్టాడు. దీంతో 5 బంతుల్లో 7 పరుగులు చేస్తే సన్‌రైజర్స్ గెలవాల్సిన మెరుగైన స్థితిలోకి వచ్చింది. ఆ తర్వాత బంతికి క్లాసెన్ సింగిల్ తీశాడు. ఇక్కడ నుంచి మ్యాచ్ మళ్లీ టగ్ ఆఫ్ వార్‌కు దారి తీసింది. 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో స్ట్రైకింగ్ ఎండ్‌లోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ అత్యాశకు పోయి ఔటయ్యాడు. అత్యాశకు పోయి ఔటయ్యాడు: సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాలని భావించిన అహ్మద్ ఘోర తప్పిదం చేశాడు. మంచి బంతిని గౌరవంగా సింగిల్ తీసుకుని ఉంటే సరిపోయేదానికి గాల్లోకి లేపాడు. దీంతో లాంగ్ ఆఫ్ దగ్గర చేతిలోకి చిక్కాడు. దీంతో 3 బంతుల్లో 6 చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్కో జెన్సెన్ సింగిల్ తీశాడు. సమీకరణ 2 బంతుల్లో 5కు చేరింది. దీంతో బౌండరీ కోసం ప్రయత్నించిన క్లాసెన్ సుయష్ శర్మ అద్భుత క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నది అక్షరాల నిజమైంది. చివరి బంతికి పరుగులేమీ రాలేదు. దీంతో కోల్‌కతా ఎగిరి గంతేసింది. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించిన రాణాను సహచరులు ఆకాశానికి ఎత్తేశారు. ఇలా చివరి ఓవర్‌లో అహ్మద్ అత్యాశతో పాటు సుయష్ శర్మ అదిరే క్యాచ్‌తో హైదరాబాద్ ఓటమితో లీగ్‌ను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. Also Read: ఐపీఎల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించిన జియో నెట్ వర్క! #cricket #srh-vs-kkr #ipl-2024 #sunrisers-hyderabad #kolkata-knight-riders మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి