Egg Boiling Tips: కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. రోజూ ఒక గుడ్డును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రోజూ బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ సమయంలో గుడ్లు తింటారు. అల్పాహారంగా గుడ్లు తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అయితే, చాలా మంది గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పలిగిపోతుండటం చూస్తుంటారు. పొట్టు సరిగా రాకపోవడం, మధ్యలోనే చిట్లిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీంతో అవి పాడైపోయానని భావించి.. పడేస్తుంటారు. అయితే, ఈ సమస్యకు కారణం ఉడకబెట్టే విధానమే అని చెబుతున్నారు నిపుణులు. ఉడకబెట్టడంలో చేసే చిన్న పొరపాట్లు గుడ్డు పగుళ్లకు దారితీస్తాయి. మరి గుడ్డు పగలకుండా సరిగా ఉడకాలంటే ఏం చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం..
గుడ్లు పగలకుండా ఉడికించడానికి సింపుల్ చిట్కాలు..
వెడల్పాటి పాన్‌లో ఉడికించాలి: రెండు గుడ్లు ఉడకబెడుతున్నట్లయితే.. కాస్త వెడల్పుగా ఉన్న బౌల్‌ను వినియోగించాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు ఉడికించేందుకు చిన్న బౌల్‌ను వినియోగిస్తే.. అవి ఒకదానికొకటి తాకి పగిలిపోయే అవకాశం ఉంది. గుడ్లు ఒకదానికొకటి తాకకుండా వెడల్పాటి పాన్‌లో ఉడికించాలి.
ఫ్రిజ్ నుండి తీసివేసిన వెంటనే ఉడికించవద్దు: కోడి గుడ్డును శీతల వాతావరణం, ఫ్రిజ్ నుంచి బయటకు తీసి నేరుగా ఉడబకబెట్టినట్లయితే.. అది పగిలిపోయే అవకాశం ఉంది. వీటిని ఫ్రిజ్ నుంచి నేరుగా నీళ్లలో వేసి మరిగిస్తే కచ్చితంగా పగుళ్లు వస్తాయి. అందుకే మొదట ఫ్రిజ్ నుండి గుడ్లను తీసి, గది ఉష్ణోగ్రత వద్ద 10 లేదా 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఉడకబెట్టడం మంచిది.
మరిగే నీటిలో ఉప్పు కలపండి: కొన్నిసార్లు గుడ్డు సరిగ్గా ఉడకబెట్టిన తర్వాత కూడా పొట్టు తీయడం కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో గుడ్లు ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు కలపాలి. ఉప్పు నీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి పెంకు తొలగించడం చాలా సులభం అవుతుంది.
మీడియం మంట మీద ఉడికించాలి: గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మంట ఎక్కువగా ఉండకూడదు. గుడ్డు ఎప్పుడూ మీడియం మంట మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు పగలదు. దాని పెంకు కూడా సులభంగా తొలగించబడుతుంది.
Also Read:
బండి సంజయ్‌కు మళ్లీ అధ్యక్ష పదవి?
తెలంగాణ సీఏంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రముఖులు..