ఇంట్లో పప్పులు, బియ్యం, మసాలాలు మొదలైన ధాన్యాలను నిల్వచేసే సంప్రదాయం మనదేశంలో ఎప్పటి నుంచో వస్తోంది. పాతకాలం వారు పెద్ద పెద్ద కుండల్లో ధాన్యం నిల్వచేస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్, స్టీల్ డబ్బాల్లో నిల్వచేస్తున్నారు. మనలో చాలా మంది బియ్యంతోపాటు పప్పులు, మసాలా దినుసులను డబ్బాల్లోనే నిల్వచేస్తుంటారు. అవసరం అయినప్పుడు మాత్రమేవాటిని తీసి వినియోగిస్తారు. అయితే నిల్వచేసిన పిండిలో తేమ ఉన్నట్లయితే వాటికి పురుగులు పడుతుంటాయి. అవి మెల్లమెల్లగా తింటూ పిండిని మొత్తం పాడు చేస్తాయి. అలాంటప్పుడు నిత్యావసర సరుకులకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎలాంటి రసాయనాలు అవసరం లేదు..ఇంట్లో ఉండే సహజ సిద్ధ పదార్ధాలతో వాటికి చెక్ పెట్టొచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
-పిండిలో పురుగులు లేదా కీటకాలు కనిపిస్తే , ముందుగా పెద్ద గిన్నెలో చక్కటి మెష్ జల్లెడతో శుభ్రం చేయండి. దీనితో మీరు నిమిషాల్లో పిండి నుండి అన్ని పెద్ద సైజు కీటకాలను సులభంగా వేరు చేయవచ్చు. కానీ ఈ పద్ధతి చిన్న కీటకాలను శుభ్రం చేయడానికి తగినది కాదు.
ఇది కూడా చదవండి: చంద్రుడిపైకి తొలిభారతీయుడు..దేశ శాస్త్రవేత్తలకు మోదీ సూచన..!!
-పిండిలో పురుగులు ఉంటే గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్ని పురుగులు, కీటకాలు చలికి చనిపోతాయి. అయితే దీని కోసం మీరు పిండిని 5 నుండి 6 రోజులు ఫ్రిజ్‌లో ఉంచాలి. అప్పుడు మీరు ఒక జల్లెడ ద్వారా పిండిని శుభ్రం చేసి దానిని ఉపయోగించవచ్చు.
-ఎండలో పిండిని ఆరబెట్టవచ్చు. ఈ వేడి కారణంగా, అన్ని కీటకాలు చనిపోతాయి లేదా పారిపోతాయి. ఈ పద్ధతిలో పిండిని శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం అవసరం.
-పిండిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. బే ఆకులు లేదా లవంగాలను పిండి పాత్రలో ఉంచండి. వంటగది రాక్‌లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. పిండిని తక్కువ పరిమాణంలో కొనడం మంచిది. లేదంటే ఎక్కువ కాలం ఉపయోగించకపోతే ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
- పిండిని నిల్వ చేసే ముందుగా డబ్బాలను శుభ్రం చేయాలి. కడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఆరిపోయాక అందులో పిండితోపాటు పాటు వేప ఆకులను వేయాలి. నిల్వ ఉంచిన పిండిలో వేప ఆకులను ఉంచడం వల్ల పురుగులు పెరగవు.
ఇది కూడా చదవండి: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్.. అసలేం జరుగుతోంది?
-నిల్వ చేసిన పిండిలో ఎర్ర మిరపకాయలను ఉంచితే.., కీటకాల సమస్య ఉండదు. పిండిలోకి కీటకాలు రాకుండా ఎండు మిర్చిలను అక్కడక్కడా ఉంచాలి. ఎర్ర మిరపకాయను పిండిలో ఉంచడం వల్ల పురుగు పట్టదు. అంతే కాకుండా పిండిలో ఉప్పు కూడా వేసి ఉంచవచ్చు. ఇలా చేస్తే పిండి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా నిల్వ ఉంటుంది.