Kitchen Cleaning: క్షణాల్లో జిడ్డును వదిలించుకోండిలా.. కిచెన్‌ క్లీనింగ్‌ టిప్స్‌పై ఓ లుక్కేయండి!

టైల్స్, గోడలపై మరకలను తొలగించడానికి లిక్విడ్ డిష్ వాష్ యూజ్‌ చేయండి. జిగట మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా కూడా బెస్ట్. మరకలపై అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత శుభ్రమైన గుడ్డ, నీటితో గోడపై తుడవండి.

New Update
Kitchen Cleaning: క్షణాల్లో జిడ్డును వదిలించుకోండిలా.. కిచెన్‌ క్లీనింగ్‌ టిప్స్‌పై ఓ లుక్కేయండి!

kitchen cleaning: మనుషుల్లో జిడ్డుగాళ్లు అని కొంతమందిని అంటుంటారు. అంటే పట్టుకుంటే వదలరు అని అర్థం. అయితే వాళ్లనైనా వదిలించుకోవచ్చు కానీ కిచెన్‌లోని జిడ్డును మాత్రం వదిలించుకోవడం చాలా కష్టం. మొండి మరకలని వదిలించుకోండిలా అని కొన్నిసార్లు టీవీ అడ్వెర్‌టైజ్‌మెంట్లలో చూస్తుంటాం. అయితే టీవీలో చెప్పినట్లు ఈ పని సింపూలైతే కాదు. కొన్నిసార్లు గంటల సమయం పడుతుంది. తరచుగా వంటగదిలో ఫుడ్‌ తయారు చేసేటప్పుడు టైల్స్‌తో పాటు గోడలపై జిడ్డు మరకలు కనిపిస్తాయి. ఈ మచ్చలను శుభ్రం చేయకపోతే అవి మొండిగా మారతాయి. కానీ ఇప్పుడు కిచెన్ టైల్స్‌పై ఉన్న మొండి మరకలను శుభ్రం చేసే టెన్షన్ మర్చిపోండి. ఎందుకంటే కొన్ని క్షణాల్లో ఈ మచ్చలను తొలగించే సింపుల్ టిప్ మీకు చెప్పబోతున్నాం.

కిచెన్‌లోని జిడ్డును ఇలా వదిలించుకోండి

బేకింగ్ సోడా: వంటగది టైల్స్ లేదా గోడలపై నూనెకు సంబంధించిన జిగట మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా బెస్ట్. ఇందుకోసం బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌ను మరకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత ఆ పేస్ట్‌ను శుభ్రమైన గుడ్డ, నీటితో గోడపై నుంచి తుడుచుకోవాలి. గోడ ఎండిపోయినప్పుడు దానిపై మచ్చలు కనిపించవు.
లిక్విడ్ డిష్ వాష్: టైల్స్, గోడలపై మరకలను తొలగించడానికి లిక్విడ్ డిష్ వాష్ చీప్‌ అండ్‌ బెస్ట్ మార్గం. లిక్విడ్ డిష్ వాష్‌ను మరకలకు అప్లై చేసి గంట సేపు గోడపై ఉంచాలి. తరువాత శుభ్రమైన గుడ్డ తీసుకొని గోడపై ఉన్న లిక్విడ్ డిష్ వాష్‌ను తుడవాలి.
వెనిగర్: మొండి మరకలను తొలగించడంలో వెనిగర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీని కోసం, గోడపై ఉన్న నూనె మరకలను తొలగించడానికి సమాన మొత్తంలో వెనిగర్, నీరు తీసుకోవాలి. తర్వాత స్పాంజ్ లేదా గుడ్డతో నూనె మరకపై అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాలు అలా ఉంచండి. తరువాత తడి గుడ్డతో పూర్తిగా తుడవాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు