Telangana: ఆ స్టేషన్లకోసం అదనపు భూమి కేటాయించండి.. సీఎంకు కిషన్ రెడ్డి లేఖ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్లపల్లి, సికింద్రాబాద్, మౌలాలి రైల్వేస్టేషన్లకు అదనపు భూమి కేటాయించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాశారు. పెరుగుతున్న ప్రయాణికులతో హైదరాబాద్ లోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లపై అధిక భారం పడుతోందని ఆయన తెలిపారు. By srinivas 30 Jan 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kishan reddy : బీజేపీ కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్లపల్లి, సికింద్రాబాద్ (Secundrabad), మౌలాలీ (moulali) రైల్వేస్టేషన్ల అదనపు భూమి కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) గారికి లేఖ రాశారు. పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లపై అధిక భారం పడుతోందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా నగర పరిధిలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద కొత్త టెర్మినల్ ను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే సంకల్పించిందన్నారు. అప్రోచ్ రోడ్డు.. అయితే తదనుగుణంగా మార్చి 2024 లక్ష్యంగా చర్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో టెర్మినల్ నిర్మాణం, అదనపు ప్లాట్ ఫాంల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. రైల్వేస్టేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా, రైల్వేస్టేషన్‌కు వెలుపల ఇరువైపులా ప్రయాణికులు, వాహనాలు రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించటానికి వీలుగా అప్రోచ్ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పార్కింగ్ తదితర అవసరాల కోసం స్టేషన్‌కు ఇరువైపులా అవసరమైన అదనపు భూమిని కేటాయించాల్సి ఉందని. FCI గోడౌన్ రోడ్డు నుండి కొత్త స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. భవిష్యత్తులో ఈ రహదారి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించటానికి ప్రధాన రహదారిగా మారనుందని ఆయన అన్నారు. రహదారి అభివృద్ధి.. ఇక భరత్ నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుండి చర్లపల్లి స్టేషన్ కు వచ్చే రహదారిని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఇప్పటికే 30 అడుగుల రహదారి ఉంది. దీనిని కనీసం 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలి. EC నగర్ నుండి చర్లపల్లి స్టేషన్‌లోని MMTS ప్లాట్‌ఫాంను చేరుకునే రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. EC నగర్ ప్రధాన రహదారి నుండి స్టేషన్‌ను చేరుకునే ఈ రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటితో పాటుగా చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, MMTS ప్లాట్‌ఫాం వైపు 2.7 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉందని చెప్పారు. చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్.. చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్లను రైల్వే శాఖ ఇప్పటికే జమ చేసింది. ఈ నీటి కనెక్షన్‌ను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలి. వీటితో పాటుగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్‌ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉంది. ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆల్ఫా హోటల్ నుండి రేతిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలని సూచించారు. ఇది కూడా చదవండి: కోదండరాంను ప్రశ్నించేంత పెద్దోళ్లా?.. కుట్రతోనే అడ్డుకున్నారు.. మండపడ్డ సీఎం రేవంత్ మురుగునీరు రైల్వేట్రాక్ మీదకు.. మౌలాలీ యార్డ్ స్టేషన్ పరిధిలో స్టేషన్‌కు ఇరువైపులా నివసిస్తున్న కుటుంబాల నుండి మురుగునీరు రైల్వేట్రాక్ మీదకు వస్తోంది. ఈ మురుగునీటి కారణంగా, ట్రాక్‌లు మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జిల విస్తరణకు ఇదివరకే పనులు కూడా మంజూరయ్యాయి. కావున మునిసిపల్ ఏరియా పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడున్న 2 మీటర్ల నుండి 4.8 మీటర్లకు విస్తరించాలి. ఈ విషయాలపై.. రైల్వే శాఖ అధికారులు, GHMC అధికారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఆశించిన సహకారం అందలేదు.. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ.. గతంలో ముఖ్యమంత్రి గారికి 15 జూన్, 2022 న, 07 మార్చి, 2023 న లేఖలు రాశాను. అయినప్పటికీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదు. కావున, పై విషయాలపై మీరు ప్రత్యేక చొరవ తీసుకుని నగరానికి ఎంతో అవసరమైన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోగలరని కోరారు. #cm-revant-reddy #letter #bjp-kishan-reddy #railway-land మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి