Kishan Reddy: అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: కిషన్‌రెడ్డి

మన భారతీయ సాంస్కృతిక వైభవం వెనుక ఉన్న మహర్షులు, చింతనాపరుల కృషి చాలా ఉంది. వారు తమ త్యాగాలతో జ్ఞానాన్ని మానవాళికి అందజేశారు. అంతేకాదు భౌతిక, ఆధ్యాత్మిక విలువలను ధర్మం పునాదిగా అభివృద్ధి పరిచిన గొప్ప వ్యక్తలకు హైదరాబాద్‌ ఘనంగా నివాళులుర్పించారు.

New Update
కాంగ్రెస్ అంటేనే అవినీతి.. కిషన్ రెడ్డి ఫైర్!

అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీజేపీ మాత్రమేనని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీన్దయాల్ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మొక్కలు నాటారు. దేశ సమగ్రత కోసం ప్రారంభించిన పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీ ఏర్పడక ముందు భారతీయ జనసంఘ్‌గా ఉండేదన్నారు. దీన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారు. ఆపై దీన్దయాల్ జ సంఘ్‌ను బీజేపీగా మార్చారు అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ దీన్దయాల్ ఎన్నడూ తన విలువలు కోల్పోలేదన్నారు.బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి వెళ్లిన ఆర్థిక విధానాలు వద్దని.. పలు మార్పులు తీసుకొచ్చారు. నూతన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. పేదల కోసం అంత్యోదయ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దీన్దయాల్ ఆయన ఎలా మరణించాడో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదన్నారు. ఆయన మరణం ఇంకా మిస్టరీగానే ఉందన్నారు. రైల్ ట్రాక్‌పై మృతి చెంది పడి ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్‌ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తోందన్నారు.

దీన్​దయాళ్​ 916 సెప్టెంబర్ 25న ఉపాధ్యాయ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. పాశ్చాత్య తత్వవేత్తల్లా కాకుండా వ్యక్తి, సమాజంల సంబంధాన్ని సమగ్రంగా ఆయన విశ్లేషించారు. వ్యక్తిగత జీవితంతోపాటు సాంఘిక జీవితాన్ని పాశ్చాత్యులు కుటుంబం, సమాజం, మానవజాతి ఇలా అన్నిటినీ విభిన్న అంశాలుగానే ఆయన చూశారు. అంతేకాదు ఒక్కో అంశం గురించి లోతుగా అధ్యయనం చేసిన గొప్ప వ్యక్తి దీన్​దయాళ్. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ‘‘పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారికి ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలిని సమర్పిస్తున్నాను. అంత్యోదయకు మరియు పేదల సేవకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం మనకు ప్రేరణను ఇస్తూనే ఉంటుంది. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడిగా మరియు ఒక మేధావిగా కూడాను ఆయనను అందరూ స్మరించుకోవడం జరుగుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు