Kishan Reddy: దేశ ప్రజలందరికీ గర్వకారణం.. పీవీకి భారతరత్నపై కిషన్ రెడ్డి

పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశానికి వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని కొనియాడారు. దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.

New Update
Kishan Reddy: దేశ ప్రజలందరికీ గర్వకారణం.. పీవీకి భారతరత్నపై కిషన్ రెడ్డి

Kishan Reddy on PV Narasimha Rao Bharat Ratna: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు (PV Narasimha Rao) భారతరత్న ప్రకటించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నకు ఎంపిక కావడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.

దూరదృష్టి గల నాయకుడు..
ఈ మేరకు పీవీ దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని కొనియాడారు. పొగిడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (AP CM), కేంద్రమంత్రిగా దేశంకోసం, దేశాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి (Prime Minister) హోదాలో.. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ పురోగతికి వారు పునాదులు వేశారని పొగిడేశారు.

దేశానికి ప్రత్యేక గుర్తింపు..
భారతదేశంలోకి ప్రపంచ మార్కెట్‌ను ప్రోత్సహించారు. దీంతోపాటుగా భారతదేశ విదేశాంగ విధానంలో, విద్యారంగంలో ప్రత్యక్షంగా వారు తీసుకున్న నిర్ణయాలు దేశానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. చాణక్యుడిగా రాజకీయ చతురతతో దేశాన్ని ముందుకు నడిపించడంతోపాటు.. రచయితగా, సాహితీవేత్తగా, తెలంగాణ స్వాతంత్ర్య కోసం నిజాంపై పోరాడిన పోరాట యోధుడిగా ఇలా ప్రతిఅడుగులోనూ  పీవీ నరసింహారావు గారి జీవితం మనందరికీ ఆదర్శనీయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Delhi: ముగిసిన జగన్-మోడీ భేటీ.. వీటిపైనే సుదీర్ఘ చర్చ?

కాంగ్రెస్ గౌరవించలేదు..
జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే (Congress Party) ఉంటూ పార్టీ సాధారణ కార్యకర్తనుంచి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు ఏనాడూ శ్రీ పీవీ గారిని గౌరవించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు శ్రీ పీవీ నరసింహారావు గారి పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తుదిశ్వాస విడిచిన తర్వాత కూడా పార్టీ కార్యాలయంలోకి పార్థివదేహాన్ని రానీయకుండా కాంగ్రెస్ పార్టీ ఆయనను దారుణంగా అవమానించిందని మండిపడ్డారు.

అంతిమసంస్కారంలోనూ ఆటంకాలు..
ఢిల్లీలో పీవీ స్మృతి కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. చివరకు ఆయన అంతిమసంస్కారంలోనూ ఆటంకాలు కల్పించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఏనాడూ.. పీవీ నరసింహారావు గారు దేశానికి చేసిన సేవలను గుర్తుచేయలేదు. అయినప్పటికీ దేశానికి వారు చేసిన సేవలను బీజేపీ పార్టీ నేతృత్వంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) గారు గుర్తించి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో (Bharat Ratna) వారిని గౌరవించడం గొప్పవిషయం.ఇది దేశప్రజలందరికీ గర్వకారణమంటూ చెప్పుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు