Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై ఏం చేస్తున్నారు? అవినీతిని కక్కించాల్సిందే అంటున్న కిషన్ రెడ్డి.!

కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా? లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంపై పదే పదే ప్రశ్నించిన రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై ఏం చేస్తున్నారు? అవినీతిని కక్కించాల్సిందే అంటున్న కిషన్ రెడ్డి.!
New Update

Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఎంటి? కాళేశ్వరం అవినీతి పై దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా? లేదా? కాళేశ్వరం అవినీతి మీద మోడీ కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై కాంగ్రెస్ ఎందుకు ఊచలు లెక్క పెడుతుంది? దోషాలకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా? లేదా?  కాళేశ్వరం పై సీబీఐ దర్యాప్తు ను కోరుతూ..రేవంత్ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు? కాళేశ్వరం పై మీకు చిత్త శుద్ది ఉందా? లేదా? కాళేశ్వరం పై కేంద్రానికి లేఖ రాస్తారా? లేదా? అని ప్రశ్నించారు. కేసిఆర్ పీడ విరగడ కావాలనే కాంగ్రెస్ కి ప్రజలు ఓటు వేశారు తప్ప రాహుల్ గాంధీ మీద ప్రేమ తో కాదన్నారు. బీఅర్ఎస్ కు కేసిఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని విమర్శ చేశారు. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ లేదని.. తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ దని ఎద్దెవ చేశారు.

కాంగ్రెస్ అవినీతి తో కలిసి కాపురం చేసారని..అవినీతికి కాంగ్రెస్ కి వీడదియలేని బంధం ఉందని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చినప్పట్టి నుంచి ప్రజల నుండి కాంగ్రెస్ పెద్ద ఎత్తున దోచుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలు కాబట్టే బీఅర్ఎస్ పై కాంగ్రెస్ సానుభూతి చూపిస్తుందని అన్నారు.

నేషనల్ డ్యాం సెఫ్యూటీ అథారిటీ 20 అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగిందని.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఇచ్చిన 11అంశాలు కూడా నామమాత్రంగా ఇచ్చారన్నారు. సరైన వివరాలు ఇవ్వకుంటే ప్రపర్ గైడెన్స్ ఇవ్వలేము అంటూ అథారిటీ చెప్పిందని..సరైన గైడెన్స్ లేకుంటే ప్రాజెక్ట్ మనుగడ కే ముప్పు అని తెలిపిందన్నారు. 3ఏళ్లలో ప్రాజెక్ట్ కూలిపోవడం కేసిఆర్ అవినీతికి అద్దం పడుతుందన్నారు. కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన లక్ష కోట్ల మాటేమిటి? ఎన్నికలకు ముందు సీఎం ఏం మాట్లాడారు అనేది ప్రజలు గమనించాలన్నారు. కాళేశ్వరం తో తెలంగాణ ఇమేజ్ ను గోదారి పాలన చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి మీద అనేక సార్లు మాట్లాడిందని..అధికారంలోకి వస్తే కేసిఆర్ అవినీతి పై దర్యాప్తు చేస్తారన్నారని గుర్తు చేశారు. బీఅర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటి కాదు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కోరాలని ఛాలెంజ్ విసిరారు. దీనికి నేను కూడా రెక్మాండ్ చేస్తానన్నారు. మీరు కోరిన 48 గంటల్లో సీబీఐ ఎంక్వయిరీ మొదలవుతుందని ఇదే నా ఛాలెంజ్ అని పేర్కొన్నారు. కేసిఆర్ కుటుంబంపై రాష్ట్ర ప్రజలు దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారన్నారు..సీబీఐ దర్యాప్తు తో పాటు జ్యుడీషియల్ ఎంక్వైరీ కి మరింత దోహదపడుతుందని తెలిపారు.

#kaleshwaram-corruption #kishan-reddy #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe