Central Ministers Allocation : తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడికి దక్కిన శాఖలివే! కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా, బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రిగా అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, నివాస వర్మకు స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి పదవి దక్కింది. By Nikhil 10 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Kishan - Bandi - Ram Mohan : కేంద్ర మంత్రుల కేటాయింపు (Central Ministers Allocation) లో.. తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు దక్కాయి. తెలంగాణ (Telangana) లోని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి (Kishan Reddy) కి బొగ్గు, గనుల శాఖ మంత్రి పదవి దక్కింది. ఏపీలోని శ్రీకాకుళం నుంచి విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కు పౌర విమానయాన శాఖను అప్పగించారు మోదీ. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కు హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా అవకాశం దక్కింది. నరసరావు పేట ఎంపీ శ్రీనివాస వర్మకు స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి పదవి దక్కింది. Also Read : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ప్రాంతాలను చుట్టుముట్టిన రసాయన పొగ #bandi-sanjay #bjp-kishan-reddy #kinjarapu-ram-mohan-naidu #central-ministers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి