AP Politics : పుంగనూరులో కిరణ్ కుమార్ రెడ్డి Vs పెద్దిరెడ్డి.. మాటల తూటలు!

ప్రాజెక్టులపేరుతో అనుమతులు లేకుండా 2 వేల 2 వందల కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డిదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ దుయ్యబట్టారు. ఈ విషయంపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర విభజన జరగడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.

AP Politics : పుంగనూరులో కిరణ్ కుమార్ రెడ్డి Vs పెద్దిరెడ్డి.. మాటల తూటలు!
New Update

Tirupati : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంభంపై రాజంపేట(Rajampet) బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Kiran Kumar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన బీజేపీ జనసేన(Janasena) టీడీపీ(TDP) ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు వేల రెండు వందల కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దని దుయ్యబట్టారు.

Also Read: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..!

ప్రభుత్వం మారిపోతుందని ఎలాంటి అనుమతులు లేకున్న పనులు మొదలు పెట్టారని విమర్శలు గుప్పించారు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోపిడీకి, అరాచకానికి, దౌర్జన్యాలకు అక్రమ కేసులకు ఇలాగే నలుగుతారా? అని ప్రశ్నించారు. రానున్న 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, బానిసత్వం కావాలా మీరే నిర్ణయించుకోవాలని సమావేశంలో వ్యాఖ్యానించారు. వారి అక్రమాలకు పుల్ స్టాప్ పెట్టాలని పిలుపునిచ్చారు.

Also Read: జగన్ బీజేపీకి ఓ బానిస.. అన్నను ఓడిస్తేనే అభివృద్ధి: షర్మిల సంచలనం

అయితే, ఈ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi Reddy Rama Chandra Reddy) స్పందించారు. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారన్నారు.

#peddireddy #kiran-kumar-reddy #rajampet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe