Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!

టాలీవుడ్ లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు కిరణ్ అబ్బవరం త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 'రాజావారు రాణిగారు' సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్యను పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 13న వీరి నిశ్చితార్థం జరగనుంది.

New Update
Kiran Abbavaram:  తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్తగా పరిచయం అవసరం లేదు. 'రాజావారు రాణిగారు' సినిమాతో నటుడిగా ఆరంగేట్రం చేసిన కిరణ్.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

Also Read: Naga Chaitanya: ‘తండేల్’ సెట్స్ లో నాగ చైతన్య, సాయి పల్లవి కేక్ కట్టింగ్.. ఎవరి కోసమో తెలుసా..?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న కిరణ్ అబ్బవరం

అయితే తాజాగా ఈ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్నీ కిరణ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తన మొదటి సినిమా 'రాజావారు రాణిగారు' మూవీ హీరోయిన్ రహస్య గోరక్ ను కిరణ్ వివాహం చేసుకోబోతున్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఇప్పుడు ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒకటి కాబోతున్నారు.
మార్చి 13న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వీరి నిశ్చతార్థం జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆగస్టు నెలలో పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్.

publive-image

'రాజావారు రాణిగారు' సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వీరి స్నేహం ప్రేమగా మారింది. గతంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ కిరణ్.. రహస్య తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది వినరో భాగ్యం విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం 'దిల్ రూబా' సినిమాతో పాటు 1970 వ కథనం నేపథ్యంలో ఓ పీరియాడిక్ మూవీ కూడా చేస్తున్నారు.  ఈ సినిమాలకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Also Read: Tovino Thomas: ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ .. ఉత్తమ నటుడిగా టోవినో థామస్

Advertisment
Advertisment
తాజా కథనాలు