Viral Video: నడిరోడ్డుపై పాము, ముంగీస హల్చల్.. చూస్తూండిపోయిన జనం

నడిరోడ్డుపై పాము, ముంగీస పోట్లాడుకున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై జరిగింది. దాదాపు అరగంట సేపు ప్రధాన రహదారిపై తాచుపాము, ముంగీసలు కొట్టుకున్నాయి. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది. ఇది దూరంగా గమనించిన స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురై అరగంట పాటు అటు దిశగా వెళ్లలేదు. కాసేపు

New Update
Viral Video: నడిరోడ్డుపై పాము, ముంగీస హల్చల్.. చూస్తూండిపోయిన జనం

ఒక్కో జీవికి మరో జీవి అంటే పడదు. పాము చాలా విషపూరితమైనది. అది కాటేస్తే.. ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. అలాంటి దానికి ఎదురు నిలిచి పోరాడేది ఏది అంటే ముంగీస. పాముకి, ముంగీసకి అస్సలు పడదు. అవి రెండూ ఎదురు పడ్డాయంటే.. భీకర పోరే. అవి పోట్లాడుకున్న దృశ్యాలను మనం గతంలో చాలా సార్లు చూశాం.

ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా పాము, ముంగీస పోట్లాడుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. నడిరోడ్డుపై తాచుపాముపై ముంగీస దాడి చేయడానికి ప్రయత్నించింది. మరి తాచు పాము ఊరుకుంటుందా.. అది కూడా బుసలు కొడుతూ ధీటుగా ప్రతి దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

నడిరోడ్డుపై పాము, ముంగీస పోట్లాడుకున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై జరిగింది. దాదాపు అరగంట సేపు ప్రధాన రహదారిపై తాచుపాము, ముంగీసలు కొట్టుకున్నాయి. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది.

ఇది దూరంగా గమనించిన స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురై అరగంట పాటు అటు దిశగా వెళ్లలేదు. కాసేపు అవి పోట్లాడుకుని దేని దారి అది చూసుకుంది. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు