200 కిలోల ఉప్పు కుప్పలో చిన్నారుల మృతదేహాలు..ఎందుకంటే!

సోషల్‌ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.

Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..
New Update

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో కొన్ని తప్పుడు వీడియోలు నిజమే అన్నట్లు ప్రజలను నమ్మిస్తాయి. అందులో నిజం ఉన్న కాకపోయినా ప్రజలను మాత్రం నిజం అని నమ్మిస్తాయి. అలా కొన్ని వీడియోలను చూసి నిజంగానే అనుసరించే వారు కొందరు ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే ఈ సంఘటనలో తల్లిదండ్రులు.

కర్నాటక రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హవేరి జిల్లా బాదగి తాలూకా ఘలాపూజి గ్రామానికి చెందిన హేమంత్‌ (12), నాగరాజ్ (11) అనే చిన్నారులు కొద్ది రోజుల క్రితం సరస్సులో మునిగి చనిపోయారు. దీంతో తమ పిల్లలను ఎలాగైనా బతికించుకోవాలనుకున్నారు తల్లిదండ్రులు.

కొంత కాలం క్రితం వారిద్దరూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను చూశారు. అందులో చనిపోయిన వారిని ఉప్పులో ఉంచితే తిరిగి బతికినట్లు ఓ ఫేక్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. దానిని నమ్మిన తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలను కూడా 5000 రూపాయలను ఖర్చు చేసి 200 కేజీల ఉప్పును కొనుగోలు చేసి అందులో పిల్లల మృతదేహాలను ఉంచారు.

చాలా రోజుల వరకు ఈ విషయాన్ని వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టారు. అయితే చుట్టుపక్కల వారికి వారి మీద అనుమానం కలగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాలకు అంత్యక్రియలు జరిపేలా చేశారు.

ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ తప్పుడు వైరల్ వీడియోను నమ్మి పిల్లల తల్లిదండ్రులు ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Also read: గూగుల్‌ మ్యాప్స్‌ లో మరికొన్ని కొత్త ఫీచర్లు!

#karnataka #salt #dead-bodies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe