Telangana Elections 2023: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ తేదీ(Telangana Election Polling) సమీపిస్తుండగం.. ఎన్నికల ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. నేతల తమ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ తమై స్టైల్లో ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. మీ ఓటు మాకే అంటూ ఓటర్ల మనసు గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ప్రచారంలో భాగంగా కొందరు నేతలు గడప గడపకు తిరుగుతున్నారు. ఓటర్లను కలిసి.. వారి మంచి చెడుల గురించి మాట్లాడుతూ.. అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు. ఇక కొందరైతే.. ఓటర్లు తమ ఇళ్లలో పనులు చేస్తుంటే.. వారికి సాయం కూడా చేస్తున్నారు. ఆడవాళ్లు బట్టలు ఉతుకుతుంటే.. బకెట్లలో నీరు నింపి సాయం చేస్తున్నారు. మరికొందరు పిల్లలకు స్నానం చేయించడం.. ఇలా రకరకాల ఫీట్లు చేస్తున్నారు నేతలు. ఈ సంగతి ఇలాంటే.. మంత్రి పువ్వాడ ముచ్చట మేరే లేవల్ అని చెప్పుకోవచ్చు.
ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి కంటెస్ట్ చేస్తున్నారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో.. పువ్వాడ అజయ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, తన ప్రచారాన్ని ప్రత్యర్థులకు భిన్నంగా చేస్తున్నారు పువ్వాడ. ప్రచారంలో భాగంగా ఆయన ఖమ్మం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారులను కలిసి వారితో సరదాగా ముచ్చటించారు. చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్లి.. తానే స్వయంగా చెప్పులు కుట్టారు. ఆ తరువాత అరటి పండ్ల బండి వద్దకు వెళ్లి.. అరటి పండ్లను విక్రయించారు. పాన్ డబ్బా, టిఫిన్ సెంటర్ ఇలా చిరు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి తనదైశన శైలిలో ప్రచారం నిర్వహించారు పువ్వాడ. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read:
కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..