KHAMMAM POLITICS : తుమ్మలకు, నాకు బీఆర్ఎస్ లో అవమానాలే మిగిలాయి.. పదికి పది సీట్లు సాధించి బుద్ధిచెబుతాం: పొంగులేటి తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన నేతలందరూ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టికెట్ రాకపోవడంతో తుమ్మల కూడా కాంగ్రెస్‌లో వేళ్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు. By Vijaya Nimma 02 Sep 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పొంగులేటి స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న ఇద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ తుమ్మల సేవలను కొనియాడారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం చిత్తశుద్ధితో తుమ్మల పని చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన తలపండిన నేత, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. 'వినాశకాలే విపరీత బుద్ధి" అన్న చందంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉన్నవారిని పొమ్మనకుండా పొగబెడుతున్నారని ధ్వజమెత్తారు. తనను అవమానించినట్టే.. తుమ్మలను కూడా అనేక అవమానాలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కుమిలి కుమిలి పోయాం.. కనీసం అపాయింట్మెంట్ కూడా దొరక్క అవమానపడ్డాం. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో ఘన విజయం సాధించి బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతాం" అని హెచ్చరించారు పొంగులేటి. తుమ్మల రాక కోసం కాంగ్రెస్ ఎదురుచూపు తుమ్మల రాక కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోందని అన్నారు పొంగులేటి. ఇవి ఒక్కళ్లే స్వయంగా తీసుకునే నిర్ణయాలు కావని, అనుచరుల అభిప్రాయం మేరకే తుది నిర్ణయం ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అనుచరులు, మద్దతుతారులతో చర్చించి కాంగ్రెస్ లో పార్టీలో చేరానని అన్నారు. తుమ్మల కూడా ఆయన అనుచరులతో మాట్లాడి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని.. 10కి 10 సీట్లు సాధిస్తుందని అన్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించానని అన్నారు. Your browser does not support the video tag. తుమ్మల ఇంట అభిమానుల సందడి పార్టీ మార్పు ప్రచారం సందర్భంగా తుమ్మల ఇంటి దగ్గర అనుచరులు, కార్యకర్తల సందడి ఎక్కువైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తన చిరకాల మిత్రులు పొంగులేటి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ జీవితం ప్రజలు ఇచ్చిందని, అంది వచ్చిన అవకాశాలతో వచ్చిన అభివృద్ధి చేస్తానని అన్నారు. ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖలో నూటికి నూరుశాతం పనిచేశానని అన్నారు. సీతారామ నీళ్లు జిల్లాలోకి తీసుకొచ్చి మీ అందరి కాళ్ళు కడిగి రాజకీయాలకు స్వస్తి పలకాలని ఉందని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అభీష్టం మేరకే ఉంటుందని తుమ్మల వ్యాఖ్యానించారు. #khammam #thummal-nageswar-rao #invited-tummala-in-congress #poguleti-srinivas-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి