KHAMMAM POLITICS : తుమ్మలకు, నాకు బీఆర్ఎస్ లో అవమానాలే మిగిలాయి.. పదికి పది సీట్లు సాధించి బుద్ధిచెబుతాం: పొంగులేటి
తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన నేతలందరూ కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టికెట్ రాకపోవడంతో తుమ్మల కూడా కాంగ్రెస్లో వేళ్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు.