Khammam Politics: ఖమ్మం రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు.. పూటకో కండువా..రోజుకో పార్టీ!

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ పోటాపోటీగా రాజకీయాలు సాగుతున్నాయి. నిన్న ముగ్గురు బీఆర్ఎస్ సర్పంచ్ లు పొంగులేటి, తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పువ్వాడ 24 గంటలు గడవక ముందే వారికి మళ్లీ గులాబీ కండువా కప్పేలా చక్రం తిప్పారు.

Khammam Politics: ఖమ్మం రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు.. పూటకో కండువా..రోజుకో పార్టీ!
New Update

ఎన్నికలు (Telangana Elections 2023) దగ్గర పడుతున్నా కొద్దీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో (Khammam Politics) చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోటాపోటీగా చేరికలు జరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా రెండు కండువాలను కూడా మార్చుతున్నారు నేతలు. ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారితో మాట్లాడి.. 'సెట్' చేసేస్తున్నారు. ఆ సాయంత్రమే వారు మళ్లీ పాత పార్టీ కండువా కప్పుకునేలా చక్రం తప్పుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. రఘునాధపాలెం మండలానికి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ లు తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageshwar Rao), పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇది కూడా చదవండి: Maoist Letter: టార్గెట్ పొంగులేటి, పువ్వాడ.. ఎన్నికల వేళ మావోయిస్టుల సంచలన లేఖ!

రంగంలోకి దిగిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పార్టీ మారిన సర్పంచ్ లతో చర్చలు జరిపారు. దీంతో ఈ రోజు వారు మళ్లీ గులాబీ గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరిన వారిలో ఎన్.వీ బంజార సర్పంచ్ సక్రాం నాయక్, రజబల్లి నగర్ సర్పంచ్ బోడ శరత్, మంగ్యాతండా సర్పంచ్ జీజా మత్రు, రజబల్లి నగర్ ఉప సర్పంచ్ దంగుల నరసింహారావు, బొడ చిన్న తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Elections 2023: రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టైలే వేరయా!

ఇప్పుడే ఇలా ఉంటే.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోన్న చర్చ జిల్లాలో సాగుతోంది. ఎలాగైనా జిల్లాలో కాంగ్రెస్ పైచేయి సాధించేలా పొంగులేటి, తుమ్మల నాగేశ్వర రావు వ్యూహాలు రచిస్తుండగా.. ఈ సారైనా జిల్లాలో గులాబీ పార్టీ అధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో పువ్వాడ అజయ్ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

#telangana-elections-2023 #minister-puvvada-ajay #ponguleti-srinivasa-reddy #tummala-nageshwar-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe