పక్కా ప్లాన్...
సూర్యాపేట జిల్లా మోతె గ్రామానికి చెందిన పగడాల గిరిధర్‌రెడ్డి, బైరోజు వెంకటాచారి ఇద్దరు ఎదురెదురుగా నివాసం ఉన్నారు. గిరిధర్ తిరుమలగిరి మండలం మెండిచింత బావిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా, చారి నడిగూడెం మండలం సిరిపురం స్కూల్‌లో పీఈటీగా విధులు నిర్వస్తున్నారు. అయితే గిరిధర్ భార్య తరచుగా గొడవలతో ఏడేళ్లగా దూరం ఉంటోంది. వెంకటాచారి నాయకన్‌గూడెంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు.చారిపై కక్ష పెంచుకున్న గిరిధర్‌రెడ్డి హత్య చేయించాలనుకున్నారు. పాత కేసు విషయంలో బూసిగంపల సతీష్‌ను పరిచయం చేసుకున్నాడు. దీంతో వెంకటాచారి హతమార్చాలని సతీష్‌కి చెప్పాడు.ఒప్పుకున్న అతడు వారి స్నేహితులు మాతంగి మధు, మాతంగి చెవుల నరేష్‌ను పరిచయం చేసి రూ.5 లక్షల చొప్పున సుపారీ తీసుకోని..కోర్టు ఖర్చులు భరించేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ కేసులో నలుగురు వ్యక్తిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం ఉపాధ్యాయుడు బైరోజు వెంకటాచారి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహితుడు పగడాల గిరిధర్‌రెడ్డి మరో ముగ్గురితో కలిసి హత్యచేసినట్లు నిర్థారించారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా గిరిధర్‌రెడ్డి పనిచేస్తున్నారు. తన భార్యతో వెంకటాచారికి వివాహేతర సంబంధం ఉందని గిరిధర్ అనుమానించారు. గతంలో సూర్యాపేట జిల్లా మోతెలోని ఒకే కాలనీలో వెంకటాచారి, గిరిధర్‌రెడ్డి కుటుంబాలు నివాసమున్నారు. అనుమానంతో కన్నకూతురికి డీఎన్ఏ పరీక్ష గిరిధర్ రెడ్డి చేయించారు. గిరిధర్‌రెడ్డి వేధింపులతో ఇంటి నుంచి భార్య వెళ్లిపోయింది. గిరిధర్‌రెడ్డి తీరుతో మోతె నుంచి నాయకన్ గూడెంకు నివాసం వెంకటాచారి మార్చారు. తన భార్య విడిచి వెళ్లడానికి తన కుటుంబం చిన్నాభానం అవ్వడానికి వెంకటాచారి కారణమని భావించి.. వెంకటాచారిని అంతమొందించాలని గిరిధర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే గిరిధర్‌రెడ్డిపై మూడు హత్యకేసులు, ఓ వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ నేపథ్యంలో గిరిధర్ కోర్టులో పరిచమైన ముగ్గురి నేరస్తులతో కలిసి వెంకటాచారిని హత్యచేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు.ఈనెల 17న హైదరాబాద్ వెళ్లి ఓ యాప్ ద్వారా నిందితులు కారు రెంట్ తీసుకున్నారు. పలుమార్లు వెంకటాచారిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు.21, 22న హత్యచేసేందుకు ప్లానింగ్ చేశారు. స్పాట్ కుదరకపోవడంతో 23వ తేదీన పక్కా ప్లాన్ చేశారు. నాయకన్‌గూడెం నుంచి బయలుదేరిన వెంకటాచారిని అనుసరిస్తూ మార్గమధ్యంలో వెంకటాచారి బైక్‌ను కారుతో ఢీకొట్టారు దుండగులు.పడిపోయిన వెంకటాచారిని కత్తితో వేటు వేసిన మరో బైక్‌పై ఇద్దరు దుండగులు అనుసరించారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకటాచారిపై మూకుమ్మడిగా కత్తులతో నరికి కిరాతకంగా హత్యచేశారు నిందితులు.వెంకటాచారి మరణించాడని నిర్థారించుకున్నాకే ఘటనా స్థలం నుంచి నిందితులు వెళ్లిపోయారు. వెంకటాచారి హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో వివరాలు ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి వెల్లడించారు. నిందితుల నుంచి ఓరెడ్ కలర్ బ్రీజా కారు, రెండు కత్తులు, బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు.