ICC World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు బెదిరింపులు.. రద్దు చేయాలని హెచ్చరికలు.. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న వేళ.. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను బెదిరింపులకు పాల్పడ్డాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలంటూ హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. By B Aravind 18 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రత్యేక ఖలిస్థానీ దేశం ఇవ్వాలని ఇటీవల కెనడాలో కొంతమంది ఖలిస్తానీ సానుభూతిపరులు నిరసన చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని హెచ్చరికలు చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, అలాగే 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా మతపరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యూద్ధంపై భారత్ వైఖరిని కూడా అతడు ప్రశ్నించాడు. Also Read: ఆమె మద్దతు టీమిండియాకే.. సస్పెన్స్ కు తెరదించిన వాజ్మా ఇదిలా ఉండగా.. అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టీస్‌కు గురుపత్వంత్ సింగ్ నాయకుడిగా ఉన్నాడు. అయితే ఇండియాకు వ్యతిరేకంగా ఇతడు హచ్చరికలు జారీ చేయడం ఇది కొత్తదేం కాదు. గత నెలలో ప్రధాని మోదీని కూడా హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇజ్రాయెల్-హయాస్ యుద్ధం గురించి ప్రధాని మోదీ గుణపాఠం నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. భారత్‌లో కూడా ఇటువంటి యుద్ధం ప్రారంభమవుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా పన్నూ బెదిరించాడు. ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై కేసు కూడా నమోదైంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని మోదీ కూడా స్టేడియంకు రానున్నారు. Also read:లక్షా 30 వేల మందికి ఆసీస్ కెప్టెన్ సవాల్.. ఏం అన్నాడో తెలిస్తే షాక్ అవుతారు! #khalistani-terrorist #icc-world-cup-2023 #icc-world-cup-india-vs-australia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి