Yash : 'రామాయణం' కోసం 'KGF' హీరో భారీ సాహసం?

నితీష్ తివారి బాలీవుడ్ ప్రాజెక్ట్ 'రామాయణం' లో రావణుడి పాత్ర కోసం కన్నడ హీరో యష్ ఏకంగా 12 కేజీల బరువు పెరగనున్నట్లు తెలుస్తోంది.

New Update
Yash : 'రామాయణం' కోసం 'KGF' హీరో భారీ సాహసం?

Ramayana : బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) లీడ్ రోల్స్ లో బాలీవుడ్ లో 'రామాయణం' ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిందీ దర్శకుడు నితీష్ తివారి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నారు. హిందూ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో 'కెజిఫ్' హీరో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో అప్పుడే సినిమాపై ఆడియన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ హీరో యష్ అప్పుడే తన పాత్ర కోసం కసరత్తులు మొదలు పెట్టేసాడట.

తాజా సమాచారం ప్రకారం రావణుడి పాత్ర కోసం యష్ ఏకంగా 15 కేజీల బరువు పెరగబోతున్నట్టు తెలుస్తోంది. రామాయణంలో రావణుడికి భారీ పర్సనాలిటీ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు సినిమాలో యష్ సైతం అంతే భారీ దేహంతో కనిపిస్తారట. అందుకోసం ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో తన పాత్ర కోసం బరువు పెరగడంతో పాటూ డిఫెరెంట్ మేకోవర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా రామాయణాన్ని నీతిష్ తివారి మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పార్ట్ - 2 లో రావణుడి పాత్ర ఎక్కువగా ఉండబోతోంది.

బాలీవుడ్(Bollywood) లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హీరో యష్(Yash) ఈ సినిమాలో నటిస్తుండటంతో పాటూ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీరాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఏప్రిల్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కోసం మేకర్స్ ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ నిర్మించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పార్ట్-1 ని 2025 లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు యష్ ప్రెజెంట్ 'టాక్సిక్' అనే సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాకే యష్ 'రామాయణం' సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు.

Also Read : ‘పుష్ప 2’ కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Advertisment
Advertisment
తాజా కథనాలు