Tomato Hikes 100/- Kg In Delhi : ప్రతి కూరలోనూ కచ్చితంగా కనిపించే టమాటా ధర అందనంత దూరంలో ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవక పోవడం వల్ల టమాటా తోటల నుంచి దిగుబడి తగ్గడంతో టమాటాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఒకవైపు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ (RBI) ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా టమాటా ధరలు పెరిగి పోవడంతో ఆహార వస్తువుల విభాగంలో అనిశ్చితి ఏర్పడింది.
ఢిల్లీ (Delhi) లో కేజీ టమాటా రూ.90కు చేరుకుంది. ఆజాద్‌పూర్ మండి, ఘాజీపూర్ మండి, ఓఖ్లా సబ్జీ మండితో సహా ఢిల్లీలోని ప్రధాన హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లలో టమాటాల ధరలు (Tomato Price) భారీగా పెరిగాయి. వర్షాల వలన సరఫరా కొరత ఏర్పడి ధరలు పెరిగినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజుల క్రితం వరకు కూడా కిలో టమాటా రూ.20 వరకు ఉండగా, ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా రూ.90కి చేరడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఉందని తెలుస్తోంది. టమాటా ఎక్కువగా పండించే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల రబీ సీజన్ పంట దిగుబడి తగ్గిపోయింది.. ఫలితంగా మార్కెట్లోకి వస్తున్న టమాటాలు 35 శాతం తగ్గాయని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది.
Also Read:Bihar: ఎస్సైలుగా ఎన్నికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లు