Delhi : ఢిల్లీలో రూ.100కి చేరిన కిలో టమాటా రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో టమాటా ధర కిలోకు రూ.100కి పెరిగింది. By Manogna alamuru 11 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Tomato Hikes 100/- Kg In Delhi : ప్రతి కూరలోనూ కచ్చితంగా కనిపించే టమాటా ధర అందనంత దూరంలో ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవక పోవడం వల్ల టమాటా తోటల నుంచి దిగుబడి తగ్గడంతో టమాటాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఒకవైపు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ (RBI) ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా టమాటా ధరలు పెరిగి పోవడంతో ఆహార వస్తువుల విభాగంలో అనిశ్చితి ఏర్పడింది. ఢిల్లీ (Delhi) లో కేజీ టమాటా రూ.90కు చేరుకుంది. ఆజాద్‌పూర్ మండి, ఘాజీపూర్ మండి, ఓఖ్లా సబ్జీ మండితో సహా ఢిల్లీలోని ప్రధాన హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లలో టమాటాల ధరలు (Tomato Price) భారీగా పెరిగాయి. వర్షాల వలన సరఫరా కొరత ఏర్పడి ధరలు పెరిగినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజుల క్రితం వరకు కూడా కిలో టమాటా రూ.20 వరకు ఉండగా, ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా రూ.90కి చేరడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఉందని తెలుస్తోంది. టమాటా ఎక్కువగా పండించే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల రబీ సీజన్ పంట దిగుబడి తగ్గిపోయింది.. ఫలితంగా మార్కెట్లోకి వస్తున్న టమాటాలు 35 శాతం తగ్గాయని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. Also Read:Bihar: ఎస్సైలుగా ఎన్నికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లు #delhi #rbi #tomato-price మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి