Panchayat Elections : తెలంగాణ (Telangana) లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మందడుగు వేసింది. ఓటరు జాబితా (Voter List) తయారీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచూరిస్తారు.సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఇక 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. చివరికి సెప్టెంబర్ 21న వార్డుల వారీగా చివరి జాబితాను ప్రచూరిస్తారు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా తయారీపై సెప్టెంబర్ 29న కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్
ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 21న వార్డుల వారీగా చివరి జాబితాను ప్రచురిస్తారు.
Translate this News: