జనసేన (Janasena) పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ(TDP) తో పొత్తు పెట్టుకోవడంతో పార్టీని వీడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. రెండు రోజుల క్రితమే పిఠాపురం మాజీ ఇన్‌ఛార్జీ మాకినీడి శేషు కుమారి రాజీనామా చేసిన వెంటనే ఆ పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. తాజాగా ఆ పార్టీకి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి (Ketamreddy vinod kumar reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి..ఓటమి పాలయ్యారు.
Also read: విశాఖ వాసులకు గుడ్ న్యూస్!
ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ..కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వినోద్ రెడ్డితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో కేతంరెడ్డి పోటీ చేసేందుకు వీలు లేకుండా అయ్యింది.ఈ క్రమంలోనే ఆయన జనసేనకి రాజీనామా చేసి..వైసీపీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరుఫున నారాయణ పోటీ చేస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అందుకే కేతంరెడ్డి ఆ రెండు పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే వీలు లేదు. దీంతో తన అభ్యర్థిత్వానికి ముప్పు వాటిల్లుతుంది అని భావించిన కేతంరెడ్డి వైసీపీకి జంప్ అయ్యారు.