Kesineni Swetha: పార్టీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడూ..మేము ఎందుకు పార్టీలో ఉండాలి?

కేశినేని కుమార్తె, కార్పొరేటర్‌ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. పార్టీని విడిచి పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని..కానీ పార్టీకి మేము వద్దు అనుకున్నప్పుడూ ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.

New Update
Kesineni Swetha: పార్టీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడూ..మేము ఎందుకు పార్టీలో ఉండాలి?

Kesineni Nani: విజయవాడ కార్పొరేటర్‌ , ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కూతురు కేశినేని శ్వేత (Kesineni Swetha)తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే కేశినేని పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన కుమార్తె శ్వేత కూడా టీడీపీ(TDP)కి, తన కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు.

వ్యక్తిగత కారణాలతోనే...

సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్‌ కు వెళ్లిన శ్వేత.. అక్కడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను అందించారు. దానికంటే ముందు శ్వేత విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ను ఆయన నివాసం లో కలిశారు. అక్కడ ఆమె మీడియా ముందు మాట్లాడారు..'' కేవలం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. ముందు ఎమ్మెల్యేకి ఈ విషయం చెప్పాలి కాబట్టి ఆయనకు చెప్పేందకుకు ఆయన ఇంటికి వచ్చానని వివరించారు. అంతేకాకుండా ఆయన తమకు ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని తెలిపారు.

టీడీపీ ని విడాలి అని అనుకోలేదు...

తాజాగా ఆమె మేయర్‌ కి రాజీనామా అందించిన తరువాత కూడా మీడియాతో మాట్లాడారు. 11 వ డివిజన్‌ కార్పొరేటర్‌ గా నేను రాజీనామా చేశాను. మేము ఎప్పుడూ కూడా టీడీపీ ని విడాలి అని అనుకోలేదు. కానీ పార్టీ నే మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదు.. నా రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అంటూ శ్వేత చెప్పుకొచ్చారు.

ప్రాణాలకు రిస్క్‌ అని తెలిసి కూడా..

కేశినేని నాని గారు పార్టీకి రాజీనామా చేశాక క్యారకర్తలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని వివరించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేటర్‌ ల ప్రాణాలకు రిస్క్‌ అని తెలిసి కూడా మేము పోటీ చేశాము. అయినప్పటికీ పార్టీలో మాకు గత సంవత్సర కాలంగా అవమానాలే ఎదురవుతున్నాయి. గౌరవం లేని చోటు మేము పని చేయలేమని శ్వేత వివరించారు.

తెలియదు అనే భ్రమలో మేము ఉన్నాము...

నేను కానీ, కేశినేని నాని కానీ ప్రజల తరుఫున ఎప్పటికీ పోరాటం చేసత్ఆం. విజయవాడ చుట్టు పక్కల ఉన్న పార్లమెంట్‌ లో కూడా అభ్యర్థులు లేరు. విజయవాడ పార్లమెంట్‌ కి అభ్యర్థి ఉంటే ఇక్కడ ఎందుకు పార్టీ మార్చాల్సి వస్తుంది. కృష్ణాజిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో మేము ఉన్నాము కానీ వారికి అన్ని విషయాలు తెలుసాని శ్వేత పేర్కొన్నారు.

ఫ్యామిలీ నంబర్‌ గానే గుర్తించలేదు..

రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్లకు అభ్యర్థులు లేనే లేరు. ఆ నియోజకవర్గాలు వదిలి పెట్టి విజయవాడను ఎందుకు డిస్ట్రబ్‌ చేస్తున్నారో తెలియడం లేదు అని శ్వేత అన్నారు. కేశినేని చిన్ని ని అసలు ఫ్యామిలీ నంబర్‌ గా నే మేము గుర్తించలేదు. అతని గురించి మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకోను అని ఆమె అన్నారు.

ముందుగా టీడీపీ అధిష్టానం పిలిచి మాతో మాట్లాడి ఉంటే బాగుండేది..అభ్యర్థిని మారుస్తాం, సహకరించాలని కోరి ఉంటే బాగుండేది..సంవత్సరం నుంచి లేని ప్రోటోకాల్‌ నిన్న ఎందుకు వచ్చింది. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఏ పార్టీ నుంచి పోటీ చేసేది వెల్లడిస్తామని శ్వేత అన్నారు.

విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ...

నాన్నకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీల నుంచి కానీ ఇండిపెండెంట్ గా కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని అన్నారు. తిరువూరు సభకు కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్‌ అడిగారు..ఆయన పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆయనకు సంబంధం ఏంటి అని అడగడం వింతగా ఉందని ఆమె అన్నారు. కేశినేని నాని 3 వ సారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని ఆమె గట్టిగా చెప్పారు.

Advertisment
తాజా కథనాలు