Kesineni Nani : చంద్రబాబుకు కేశినేని నాని సవాల్..!

ఏపీలో చంద్రబాబు, జగన్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని టీడీపీకి సవాల్ విసిరారు కేశినేని నాని. కనీసం ఒక సచివాలయం కట్టలేని చంద్రబాబు అభివృద్ది గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విమర్శించారు.

MP Kesineni Nani: ఈ ఎన్నికల్లోనూ జరిగేది ఇదే
New Update

Kesineni Nani Challenge : ఎన్టీఆర్ జిల్లా(NTR District)  మైలవరంలో నూతన వైసీపీ(YCP) కార్యాలయం ప్రారంభం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని(MP Kesineni Nani), మంత్రి జోగి రమేష్, ఇన్చార్జి సర్నాల తిరుపతిరావు యాదవ్, పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కు కేశినేని నాని బహిరంగంగా సవాల్ విసిరారు.

చంద్రబాబుకు సవాల్..

చంద్రబాబు చేసిన అభివృద్దికి జగన్(YS Jagan) చేసిన అభివృద్ది చర్చకు తాను సిద్ధం అని ప్రకటన చేశారు. కనీసం ఒక సచివాలయం కట్టలేని వాడు అభివృద్ది గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రోజు మైలవరంలో సభకు వచ్చిన వారికన్నా చంద్రబాబు సభలకు సగం కూడా రావటం లేదని ఎద్దేవా చేశారు. కుప్పంకు నీళ్ళు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు టీడీపీ(TDP) కి బీసీలు గుర్తుకు వస్తారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్నికల తరువాత కనీసం గుర్తు ఉండవని కామెంట్స్ చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడని.., వాడుకొని వదిలేసే రకమని మండిపడ్డారు. 40 ఏళ్ళ తరువాత రాజ్యసభలో టీడీపీ  ఖాళీ అయిందన్నారు. 2024 ఎన్నికల తరువాత సొంత రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయమని అన్నారు.

Also Read : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే అంతే..!

తరిమి కొట్టాలి..

ఈ సందర్భంగానే మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) మాట్లాడుతూ.. మైలవరంలో పోటీకి వసంత - ఉమా కలసి బీ ఫామ్ తీసుకొని పోటి చేయాలని ఎద్దేవా చేశారు. తమ్ముడు తిరుపతిరావు యాదవ్ ఓడించండం ఖాయమని ఇది నా ఛాలెంజ్ అన్నారు. చంద్రబాబు - పవన్ తోడు దొంగలను వారిని తరిమి కొట్టాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు తలపైకెత్తి తిరేగేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. కుప్పం - మంగళగిరిలో తండ్రి కొడుకుల ఓటమి ఖాయమని అన్నారు.

#ntr-district #kesineni-nani #ap-ex-cm-chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe