/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kesineni-nani-2.jpg)
Kesineni Nani Office Closed : వైసీపీ (YCP) అధికారం కోల్పోవడంతో విజయవాడ (Vijayawada) మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు వరకు టీడీపీ (TDP) లో ఉన్న కేశినేని .. తీరా ఎన్నికలు టైంలో వైసీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.
Also Read: ఘోరం.. భర్త అంత్యక్రియలకు అడ్డుపడ్డ భార్య.. !
ఈ నేపథ్యంలోనే తాజాగా, విజయవాడలో కేశినేని నాని కార్యాలయం మూతపడింది. నిన్నటి ప్రకటన తరువాత కేశినేని భవన్ పైన ఏర్పాటు చేసిన వైఎస్ జగన్‌తో దిగిన బోర్డులు మొత్తం కేశినేని నాని కార్యాలయ సిబ్బంది తోలగించారు. అయితే, ఆ బోర్డుల స్థానంలో ఏ బోర్డులు ఏర్పాటు చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విజయవాడ ప్రజలు.