KCR Movie : కేసీఆర్ చేతుల మీదుగా 'KCR' మూవీ సాంగ్ రిలీజ్.. వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ!

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడ వేగా అంజి దర్శకత్వంలో రాకింగ్ రాకేష్ హీరోగా 'కేశవ చంద్ర రమావత్' (KCR) అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాటను రిలీజ్ చేశారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించడం విశేషం.

New Update
KCR Movie : కేసీఆర్ చేతుల మీదుగా 'KCR' మూవీ సాంగ్ రిలీజ్.. వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ!

'KCR' Movie Song Release : జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన కొందరు కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను హీరోలుగా మారగా.. తాజాగా ఆ లిస్ట్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) కూడా చేరిపోయాడు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడ వేగా అంజి దర్శకత్వంలో రాకింగ్ రాకేష్ హీరోగా 'కేశవ చంద్ర రమావత్' (KCR) అనే సినిమా తెరకెక్కుతోంది. రాకేష్ హీరోగానే కాకుండా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేశారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించడం విశేషం.

Also Read : అల్లు అర్జున్ ను ఢీ కొట్టనున్న మహానటి.. ‘పుష్ప 2’ కి పోటీగా కీర్తి సురేష్ కొత్త సినిమా!

కేసీఆర్ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్...

కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన 'తెలంగాణ తేజం' పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ, గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధన చారి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు