Keerthi Suresh : అల్లు అర్జున్ ను ఢీ కొట్టనున్న మహానటి.. 'పుష్ప 2' కి పోటీగా కీర్తి సురేష్ కొత్త సినిమా!

కీర్తి సురేష్ నటించిన 'రఘు తాతా' మూవీని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది. దీంతో కోలీవుడ్ లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది.

New Update
Keerthi Suresh : అల్లు అర్జున్ ను ఢీ కొట్టనున్న మహానటి.. 'పుష్ప 2' కి పోటీగా కీర్తి సురేష్ కొత్త సినిమా!

Keerthi Suresh Raghu Thatha Movie Release Date : గత ఏడాది 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఈ ఏడాది ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ అటు తమిళంలో 'రఘు తాత' అనే సినిమా చేసింది.

సుమన్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి రీసెంట్‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Also Read : హీరోయిన్ అమలా పాల్ కవలలకు జన్మనిచ్చిందా? అసలు నిజం ఇదే!

'పుష్ప 2' కి పోటీగా

కీర్తి సురేష్ నటించిన 'రఘు తాతా' మూవీని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది. దీంతో కోలీవుడ్ లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది. నిజానికి 'పుష్ప 2' కోసం ఆల్ ఓవర్ ఇండియన్ సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అటు తమిళంలోనూ బన్నీకి భారీ క్రేజ్ ఉంది. ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్ బన్నీతో పోటీకి దిగుతుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. KGF, సలార్ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తి సురేష్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) స్టూడెంట్ పాత్రలో నటించిన ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు