కోవిడ్ సబ్ వేరియంట్ పై కేరళ మంత్రి కీలక ప్రకటన

దేశంలో ఆందోళన కలిగిస్తున్న కరోన కొత్త వేరియంట్ పై కేరళ మంత్రి వీణా జార్జ్‌ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ వల్ల ప్రాణ నష్టం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

New Update
కోవిడ్ సబ్ వేరియంట్ పై కేరళ మంత్రి కీలక ప్రకటన

కేరళలో రాష్ట్రంలో కరోన కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ జేఎన్1 సబ్ వేరియంట్‌' వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా 19 కరోనా కేసులు నమోదవడంతోపాటు సాధారణ కోవిడ్ కారణంగా రెండు మరణాలు సంభవించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి కేరళ మంత్రి వీణా జార్జ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ వల్ల ప్రాణ నష్టం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రెండు, మూడు నెలల క్రితమే భారతీయుల్లో సబ్‌వేరియంట్‌ గుర్తించామని, సింగపూర్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ మొదటి కేసు నమైదైనట్లు ఆయన తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కొవిడ్ సబ్‌ వేరియంట్‌ ఉందని, జినోమిక్‌ సీక్వెన్సింగ్ ద్వారా కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ను గుర్తించి చికిత్స అందిచాలన్నారు. అలాగే దీని బారినపడ్డ వ్యక్తుల ఆరోగ్య వ్యవస్థ చాలా బాగుందని, ఎలాంటి ప్రాణ నష్టం లేదని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. కొవిడ్‌ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రజలు అలర్ట్ గా ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడపొద్దు.  పబ్లిక్ ప్లేస్ లో మాస్కులు వాడాలని సూచించారు.

ఇదికూడా చదవండి :బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన దీపిక.. ఈ రెండు పాటిస్తే చాలు అంటోంది

ఇక అధికారిక లెక్కల ప్రకారం నవంబర్ లో 470 కేసులు ఉండగా.. డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈ కొత్త వేరియంట్ కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. శ్వాస సంబందిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులకు కోవిడ్ సోకినట్లు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ జేఎన్1 సబ్ వేరియంట్‌ని దక్షిణాది రాష్ట్రం గుర్తించినట్లు నివేదికలు ఉన్నప్పటికీ వైరస్ పై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం ఆంక్షలు, నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది మరణించగా చాలా దేశాలు నష్టం చేకూరుంది. అయితే తాజాగా జేఎన్ 1 (JN.1) అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనాకు చెందిన 'జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ' అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఈ వైరల్ కారణంగా ఇప్పటివరకూ ఏడు కేసులు దొరికాయని, మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మేరకు'యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' అధికారులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ జేఎన్ 1కు బీఏ 2.86 సబ్ వేరియంట్ లకు దగ్గరి సంబంధం ఉందని వెల్లడించారు. ఈ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి పెరగవచ్చని, స్పైక్ ప్రోటీన్‌లో జేఎన్.1,బీఏ.2.86 మధ్య ఒకే ఒక్క మార్పు ఉందని వైద్యాధికారులు తెలిపారు. జేఎన్ 1 సబ్ వేరియంట్ ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యాధికారులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు