Kerala: కేరళంగా మారునున్న కేరళ..అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు. By Manogna alamuru 25 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kerala Name Change: కేరళ పేరు కేరళంగా మారనుంది. దీని పేరును మార్చాలని కేంద్రాన్ని కోరుతూ రూపొందించిన రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానించింది. గత ఏడాదిలోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు కేంద్రం కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇప్పుడు మార్పులు చేసి మళ్ళీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదం పొందింది. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు. అధికార ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సభ్యులు ఆమోదించారు. కేరళ పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోనూ అందుకు అనుగుణంగా మార్పు చేయాలన్నారు. రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని కేరళంగా సవరించాలి. ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో మార్పులు చేయాలి అని సీఎం పినరయి విజయన్ అని కోరారు. Also Read:కసి తీర్చుకున్న టీమ్ ఇండియా-ఆస్ట్రేలియాపై విజయం #kerala #assembly #name #pinarapi-vijayan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి